వేసవి బడులకు విశేష స్పందన | heavy response to summer studies | Sakshi
Sakshi News home page

వేసవి బడులకు విశేష స్పందన

Published Sun, May 25 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM

heavy response to summer studies

నాగిరెడ్డిపేట, న్యూస్‌లైన్ : ‘అందరూ చదవాలి..అందరూ ఎదగాలి’ అనే లక్ష్యసాధన దిశగా..ప్రభుత్వ పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులను రాణించేలా చేయాలనే ఉద్దేశం తో వేసవి సెలవుల్లో ఆర్వీఎం అధికారులు అభ్యాస దీపికలను అందజేసి పాఠశాలల సముదాయాల్లోనే వేసవిబడులను ప్రారంభించారు. గ్రామాల్లో వేసవి తరగతులను సీఆర్పీలు నిర్వహిస్తున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఆంగ్లం, గణితాల్లో విద్యార్థులలో కనీస సామర్థ్యాలను పెంపొందించాలనే ఆశయంతో ప్రభుత్వం ఈ తరగతులను ప్రారంభించింది.

 వేసవి సెలవుల్లో విద్యార్థులు అభ్యాసదీపికకు కొంతసమయం కేటాయించి ఆడుతూ, పా డుతూ ఆనందంతో అభ్యాసాలు, కృత్యాలు చేసే ఉపయోగకరంగా ఉండేవిధంగా కృషి చేస్తున్నారు. మం డలంలోని గోపాల్‌పేట కాంప్లెక్స్ పరిధిలో గల గోపాల్‌పేట, బొల్లారం కాంప్లెక్స్ పరిధిలోని బొ లా ్లరం ప్రాథమిక పాఠశాల, తాండూర్ కాంప్లెక్స్‌పరిధిలోని కిచ్చన్నపేట ప్రాథమిక పాఠశాల, మాల్తుమ్మెద కాం ప్లెక్స్ పరిధిలోని గోలిలింగాల ప్రాథమికొన్నత పాఠశాలలో  వేసవి తరగతులు నిర్వహిస్తున్నారు.

 ప్రతిరోజు రెండు గంటలు
 ప్రతిరోజు ఉదయం 7.30 గంటల నుంచి 9.30గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. 1-5వ తరగతిలో విద్యనభ్యసించే విద్యార్థుల్లో ‘సి’గ్రేడ్‌లో ఉన్న విద్యార్థులను గుర్తించి వారిలో కనీస సామర్థ్యాలను పెంపొందించడమే ఈ తరగతుల ముఖ్య ఉద్దేశం. ఈ నెల 10న జిల్లావ్యాప్తంగా పాఠశాలల కాంప్లెక్స్‌ల్లో సంబంధిత సీఆర్పీలు వేసవి బడులను ప్రారంభించారు. తెలుగులో వర్ణమాల-కృత్యాలు, సరళ, గుణింత, దిత్వాక్షర, సంయుక్తాక్షర పదాలు, చిన్న చిన్న వా క్యాలు, పొడుపుకథలు, సామెతలు, చిత్రకథ , ఎత్తుకుపై ఎ త్తు, కోతి-క్రికెట్ వంటి వాటిని వేసవి తరగతుల్లో సీఆర్పీలు గేయకథల రూపంలో విద్యార్థులకు బోధిస్తారు. ఆంగ్లంలో వర్క్‌బుక్, అల్ఫాబిట్ తదితర వాటిని విద్యార్థులకు నేర్పిస్తారు. గణితంలో సంఖ్యల గురించి తెలియజేయడం, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు నేర్పిస్తారు.

 తల్లిదండ్రులకు సైతం పెరిగిన ఆసక్తి
 వేసవిబడులకు విద్యార్థులను పంపించేందుకు వారి తల్లిదండ్రులు సైతం ఆసక్తిని కనబరుస్తున్నారు. వేసవి సెలవుల్లో కేవలం ఉదయంపూట చల్లని వాతావరణంలో రెండుగంటలపాటు తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వారు పే ర్కొంటున్నారు.  పాఠశాలలు పునఃప్రారంభమైన తరువాత వారు కింది తరగతుల్లో నేర్చుకున్న అంశాలను మర్చిపోతారని, అలాకాకుండా వేసవి తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులకు పునశ్చరణ స్పష్టంగా ఉంటుందని  అభిప్రాయ పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement