కోర్టు ఆవరణలో కత్తితో పొడుచుకుని.. | Home Guard Association state president commit suicide | Sakshi
Sakshi News home page

కోర్టు ఆవరణలో కత్తితో పొడుచుకుని..

Published Wed, May 10 2017 2:33 AM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

కోర్టు ఆవరణలో కత్తితో పొడుచుకుని..

కోర్టు ఆవరణలో కత్తితో పొడుచుకుని..

హోంగార్డుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆత్మహత్యాయత్నం

బెల్లంపల్లి: ఏడేళ్ల నుంచి తనకు, హోంగార్డులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ హోంగార్డుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సకినాల నారాయణ మంగళవారం కోర్టు ఆవరణలో కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓ కేసు విషయంలో నారాయణ మంగళవారం బెల్లంపల్లి జూనియర్‌ సివిల్‌ కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి బదిలీ కావడంతో కోర్టు క్లర్క్‌ మరో తేదీ ఇచ్చి కోర్టుకు హాజరు కావాలని సూచించారు. కోర్టు హాలులో నుంచి బయటకు వస్తూనే నారాయణ వెంట తెచ్చుకున్న కత్తితో తొలుత చేతిపై కోసుకున్నాడు. ప్రధాన ద్వారం వద్దకు వచ్చి కడుపులో పొడుచుకోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఇది చూస్తున్నవారు బలవంతంగా ఆ కత్తిని లాక్కున్నారు. అంతలోనే నారాయణ కోర్టు ఆవరణలో నుంచి బయట రోడ్డు పైకి వచ్చి కూలబడ్డారు.

సమాచారం అందుకున్న టూటౌన్‌ ఎస్‌హెచ్‌వో కె.స్వామి, వన్‌టౌన్‌ ఎస్సై గంగరాజగౌడ్‌ వచ్చి తమ వాహనంలో నారాయణను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై నారాయణ మాట్లాడుతూ తనకు హోంగార్డు ఉద్యోగం లేకుండా చేశారని, హోంగార్డుల సమస్య లను కూడా పరిష్కరించకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశానన్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నారాయణపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ ఎస్‌హెచ్‌వో కె.స్వామి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement