పరకాల : ‘మాకు ఇండ్లు లెవ్వు.. కొడుకులు బువ్వ పెడ్తలేరు.. మీరేమో పింఛన్ పైసల నుంచి ఇంటి పన్ను కట్ చేత్తాండ్లు.. గిదేం పని సారూ.. ఎట్ల బతుకాలె’ అంటూ వృద్ధులు పరకాల నగర పంచాయతీ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. పింఛన్ డబ్బు ల్లో కోత పెడితే సహించేది లేదని హెచ్చరించారు. శనివారం పట్టణంలోని రాజిపేట లో పింఛన్ల పంపిణీ కోసం జూనియర్ అసిస్టెంట్ వెంకట్‌రెడ్డి, మార్క విజయభాస్కర్, రాజిరెడ్డి వచ్చారు. పింఛన్ ఇస్తూ ఇంటి పన్ను చెల్లించాలని కోరడంతో వృద్ధులు, వికలాంగు లు, వితంతువులు అధికారులపై మండిపడ్డా రు. మా కొడుకులు బువ్వ పెట్టకపోతే ఇళ్ల పక్కన పరదాలు కట్టుకొని బతుకుతున్నం.. ఇండ్లళ్ల ఉండెటోళ్లను పన్నులు అడుక్కోవా లె.. మా పైసలను ఎందుకు తీసుకుంటరని అధికారులతో ఘర్షణకు దిగారు.
పింఛన్ మొత్తం ఇస్తేనే తీసుకుంటామని తేల్చి చెప్పా రు. పింఛన్ దారులకు మద్దతుగా వచ్చిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివా స్, సీపీఎం నాయకులు బొట్ల నరేష్, ఏకు రఘుపతి కమిషనర్ ఇంద్రసేనారెడ్డికి ఫోన్ లో సమాచారం అందించడంతో అక్కడకి చేరుకున్నారు. పింఛన్ డబ్బులను ఇంటి పన్నుకు లింకు పెట్టడం ఏందయ్యా అంటూ వృద్ధులు నిలదీయగా పన్నులు చెల్లిస్తేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఇప్పటికైతే పింఛన్ డబ్బు పూర్తిగా ఇస్తున్నాం.. తర్వాతనైనా పన్నులు చెల్లించాలని కమిషనర్ కోరడంతో వారు శాంతించారు.
పింఛన్ పైసలెట్ల తీసుకుంటరు..
Published Sun, Feb 22 2015 2:20 AM | Last Updated on Wed, Apr 3 2019 3:50 PM
Advertisement
Advertisement