హంగ్.. కింగ్! | Hung .. King! | Sakshi
Sakshi News home page

హంగ్.. కింగ్!

Published Fri, May 23 2014 2:51 AM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM

Hung .. King!

సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీఆర్‌ఎస్ మరింత దూకుడు పెంచింది. జిల్లాలో ఏడు ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకున్న గులాబీదండు జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవడంతో పాటు మెజార్టీ మునిసిపాలిటీలను చేజిక్కించుకోవాలని యోచిస్తోంది. హంగ్ ఏర్పడిన ‘పురం’లో కింగ్ మాదిరి వ్యవహరించి ఆ స్థానాన్ని కూడా తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా మేజిక్ ఫిగర్ దక్కని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తిలో ఇతర పార్టీల కౌన్సిలర్లను తమ అక్కున చేర్చుకోవాలని పథకం వేస్తోంది.
 
 సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల్లోని 206 వార్డులకు ఎన్నికలు జరి గాయి. కాంగ్రెస్ 78 వార్డులు, టీఆర్‌ఎస్ 48 వార్డుల్లో గె లుపొందగా, బీజేపీ 32, టీడీపీ 14, వైఎస్‌ఆర్ సీపీ ఐ దు, ఎంఐఎం 10, స్వతంత్రులు మరో 19 వార్డుల్లో విజ యం సాధించారు. గద్వాల మునిసిపాలిటీలో 33 వా ర్డులు ఉండగా.. కాంగ్రెస్ పార్టీ 23 వార్డుల్లో విజయం సాధించి తిరుగులేని మెజారిటీని సంపాదించింది.
 
 షాద్‌నగర్ నగర పంచాయతీలో 23 వార్డులకు కాంగ్రెస్ 15 వార్డుల్లో గెలుపొందింది. టీఆర్‌ఎస్ మాత్రం అయిజ న గర పంచాయతీలో 20 వార్డులకు 15 వార్డులను కైవసం చేసుకుంది. నారాయణపేట మునిసిపాలిటీలో 23 వా ర్డులకు బీజేపీ 12 స్థానాల్లో గెలుపొంది చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులను దక్కించుకోనుంది.
 
 పాలమూరులో ఎంఐఎం మద్దతు
 మహబూబ్‌నగర్ మునిసిపాలిటీతో పాటు నాగర్‌కర్నూ ల్, కల్వకుర్తి నగర పంచాయతీల్లో చైర్మన్,వైస్ చైర్మన్ పదవులను చేజిక్కించుకోవటమే ల క్ష్యంగా టీఆర్‌ఎస్ నాయకత్వం.. ముఖ్యంగా ఎ మ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. మహబూబ్‌నగర్‌లో 41 వార్డులకు టీఆర్‌ఎస్ ఏడు వార్డు ల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌కు 14 వా ర్డులు, టీడీపీకి మూడు, బీజేపీకి ఆరు, ఎంఐ ఎంకు ఆరు, వైఎస్‌ఆర్ సీపీకి  ఒకటి, స్వతంత్రులకు నాలుగువార్డులు దక్కాయి. ఇక్కడ టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీలు చైర్మన్ గిరీ కో సం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. చైర్మన్ పద వి పొందాలంటే మేజిక్‌ఫిగర్ 21 స్థానాలు ఉం డాలి. అయితే ఇక్కడ ఏ పార్టీకి సృష్టమైన మె జార్టీ రాకపోవటంతో ఎంఐఎం, స్వతంత్రులు, టీడీపీలతో టీఆర్‌ఎస్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వైస్ చైర్మన్ పదవిని ఆఫర్ చేయడంతో పాటు ఇతర ప్రలోభాలను ఎరగా చూపుతున్నట్లు స్థానికంగా  ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో పూర్తిసహకారం అందిస్తామని అధినేత కేసీఆర్‌కు ఎంఐఎం హామీఇచ్చింది.
 
 ఈ నేపథ్యంలోనే మహబూబ్‌నగర్ మునిసిపాలిటీతో పాటు అవసరమున్న చోట టీఆర్‌ఎస్‌కు మేలు జరిగే విధంగా ఎంఐఎం వ్యవహరించనుంది. అందులో భాగంగానే పాలమూరు మునిసిపాలిటీలో ఎంఐఎం ఆరుగురు కౌన్సిలర్లు చైర్మన్ ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే టీడీపీ, స్వతంత్ర కౌన్సిలర్లతో టీఆర్‌ఎస్ జిల్లా ముఖ్యనేతలు ముఖ్యంగా ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో మంతనాలు సాగించడంతో పాటు వైస్‌చైర్మన్ పదవిని ఆఫర్‌చేసినట్లు తెలుస్తోంది.  
 
 కందనూరు, కల్వకుర్తిపై కన్ను
 నాగర్‌కర్నూల్ నగర పంచాయతీలో 20 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ ఆరు వార్డుల్లో, టీఆర్‌ఎస్ మరో ఆరు వార్డుల్లో, బీజేపీ ఏడు వార్డుల్లో విజయం సాధించింది. మరోస్థానం స్వతంత్ర అభ్యర్థికి దక్కింది. మేజిక్ ఫిగర్ కోసం టీఆర్‌ఎస్‌కు మరో ఐదు స్థానాలు మాత్ర మే తక్కువగా ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలోని పలువురు కౌన్సిలర్లతో మద్దతు కోసం టీ ఆర్‌ఎస్ స్థానిక నాయకత్వం మంతనాలు సా గిస్తున్నట్లు తెలుస్తోంది. తమతో కలిసొచ్చే వారి కి వైస్ చైర్మన్ పదవిని ఆఫర్ చేస్తోంది. ఇదిలాఉండగా, చైర్మన్ పదవి కోసం బీజేపీ, కాంగ్రెస్ కూడా పట్టువిడుపులు లేకుండా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో అధికారం తమదే అయినందున కౌన్సిలర్ల మద్దతు సునాయాసంగా లభించవచ్చని టీఆర్‌ఎస్ భావిస్తోంది.
 
  కల్వకుర్తి నగర పంచాయతీలో 20 వార్డులు ఉన్నాయి.. ఇక్కడ కాంగ్రెస్ ఆరు, టీఆర్‌ఎస్ ఐదు, వైఎస్‌ఆర్ సీపీ నాలుగు, బీజేపీ మూడు వార్డులను ఒకరు స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ కూడా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పోటాపోటీగా చైర్మన్ పదవి కోసం మంతనాలు సాగిస్తున్నాయి. ఇక్కడ ఎవరు చైర్మన్ కావాలన్నా వైఎస్‌ఆర్ సీపీ, బీజేపీల మద్దతు తప్పనిసరి కావడంతో వైస్ చైర్మన్ పదవిని ఆఫర్‌గా ఇస్తామని హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున ఏదో ఒక విధమైన లబ్ధిని చేకూర్చగలమన్న ఆశలను కూడా ఇక్కడి టీఆర్‌ఎస్ నాయకత్వం ఎరగా వేస్తున్నట్లు తెలిసింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement