
కుమారులతో ఆందోళన చేస్తున్న రవి
రాయపర్తి: తన భార్యను ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి మంగళవారం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశాడు. బాధితుడు మూనావత్ రవి కథనం ప్రకారం.. మండలంలోని సూర్యతండాకు చెందిన పంతులునాయక్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి 20 రోజుల క్రితం తన భార్యను తీసుకెళ్లాడని తెలిపాడు.
ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపించాడు. దీంతో పిల్లలు హరిప్రసాద్, రాంప్రసాద్‌ను తీసుకొచ్చి పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేసినట్లు చెప్పాడు. పంతులునాయక్‌పై కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో తండా మహిళలు పాల్గొన్నారు.