హైదరాబాద్: నిర్మల్ చెర్వుభూములపై తనపై ఓ పత్రిక (సాక్షి కాదు) రాసిన కథనంలో వాస్తవంలేదంటూ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు. ఆ పత్రిక కథనంపై పరువునష్టం దావా వేస్తానంటూ మండిపడ్డారు. మంత్రి కొడుకు వ్యాపారాలు చేసుకోవద్దా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. స్వగృహ ఇళ్లను ప్రభుత్వోద్యోగులకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.
ఇదిలా ఉండగా శనివారం ఆయన్ను సచివాలయంలో హైకోర్టు న్యాయవాదులు కలిశారు. హైకోర్టు విభజన పూర్తయ్యేవరకు జూనియర్ సివిల్ జడ్జిల నియామకాలు చేపట్టవద్దని న్యాయవాదులు ఇంద్రకరణ్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దాంతో ఆయన హైకోర్టు విభజనను మరోసారి కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
'ఆ కథనంపై పరువునష్టం దావా వేస్తా'
Published Sat, Feb 7 2015 3:44 PM | Last Updated on Fri, May 25 2018 12:42 PM
Advertisement
Advertisement