సాక్షి, హైదరాబాద్: నిజాం పరిపాలన కాలం నాటి పారిశ్రామికవేత్త నవాబ్ షా ఆలంఖాన్ (96) ఆది వారం అర్ధరాత్రి బర్కత్‌పురాలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఏడుగురు కుమారులు ఉన్నారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్‌అలీ పరిపాలనా కాలంలో ఆయన మామగారు అబ్దుల్ సత్తార్ 1929లో దక్కన్ సిగరెట్ ఫ్యాక్టరీ (గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ) స్థాపించారు. ఈ ఫ్యాక్టరీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం అన్వర్ ఉలూమ్ స్కూల్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం అన్వర్ ఉలూమ్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్, బీఎడ్, డీఎడ్, డిగ్రీ కాలేజ్‌లు కొనసాగుతున్నాయి.
ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, ప్రజాగాయకుడు గద్దర్, విశ్రాంత ఏసీబీ డైరెక్టర్ ఏకే ఖాన్, మాజీ మంత్రి మర్రిశశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ ఎం.అంజన్‌కుమార్ యాదవ్, సియాసత్ ఎండీ జావెద్ అలీఖాన్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీంఖాన్, ఎంఐఎం ఎమ్మెల్యే బలాల్ మోజంఖాన్, ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రి ఎండీ సురేశ్‌కుమార్ గౌడ్ తదితరులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. హిమాయత్‌నగర్‌లోని మజీద్ ఏ సలీమాఖాతూన్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment