Nawab Shah
-
‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’
న్యూఢిల్లీ : తన చిరకాల స్నేహితుడు, నటుడు నవాబ్ షాను పెళ్లి చేసుకున్నానని నటి, మాజీ మిస్ ఇండియా పూజా బాత్రా పేర్కొన్నారు. అత్యంత సన్నిహితుల మధ్య ఢిల్లీలో తమ వివాహం జరిగిందని తెలిపారు. సోమవారం ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ...‘ నవాబ్‌ను ఇష్టపడుతున్నాని తెలిసిన తర్వాత పెళ్లికి ఎందుకు ఆలస్యం చేస్తున్నావని నా స్నేహితులు తరచూ అడిగేవారు. అయితే తనని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే... నాకు జీవితాంతం తోడుగా నిలవగలడనే నమ్మకం కుదిరిన తర్వాత వెంటనే వివాహ బంధంలో అడుగుపెట్టాలనుకున్నా. అవును.. మేము పెళ్లి చేసుకున్నాం. ఢిల్లీలో నేను, నవాబ్ పెళ్లి ప్రమాణాలు చేశాం. ఇరు కుటుంబాల సన్నిహితుల ఆధ్వర్యంలో ఆర్యసమాజ్‌లో నిరాడంబరంగా మా పెళ్లి జరిగింది. ఆ తర్వాత వివాహాన్ని రిజిస్టర్ చేయించుకున్నాం’ అని పూజ చెప్పుకొచ్చారు. కాగా 1993లో మిస్ ఇండియాగా ఎంపికైన పూజా బాత్రా 2011లోనే తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చారు. ఇక నవాబ్ షా భాగ్‌మిల్కాభాగ్, లక్ష్యా తదితర చిత్రాలలో నటించాడు. కొన్నిరోజుల క్రితమే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట గత వారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలో పూజా బాత్రా తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. -
పెళ్లి అయిపోయిందా?
ముంబయి : బాలివుడ్లో మరో ప్రేమజంట పెళ్లిచేసుకోబోతుంది?. కాదు కాదు వాళ్లు ఇప్పటికే పెళ్లి చేసేసుకున్నారని, తమ పెళ్లిని అధికారికంగా రిజిస్టర్ చేయడం ఒకటే మిగిలిందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఆ జంటే పూజా బాత్ర, నవాబ్షా . వీరు ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు నవాబ్షా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తుంటే వీరు పెళ్లిచేసుకున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. కొత్తగా పెళ్లైన వారు ధరించే సంప్రదాయ పంజాబీ గాజులు, మెహెందీతో నిండిపోయిన పూజ చేతులను పోస్ట్ చేశాడు నవాబ్షా. ఈ ఫోటోలను చూస్తుంటే వారు హనీమూన్ నుంచే పంపించారా? అనిపించేలా ఉందని ఓ అభిమాని చమత్కారంగా కామెంట్ చేశాడు. నా సహచరి కనిపించడానికి నాకు 46 సంవత్సరాలు పట్టింది అనే ట్యాగ్‌లైన్‌తో పూజతో రిలేషన్లో ఉన్నానంటూ నవాబ్షా రంజాన్ రోజున ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పోస్ట్ చేయడంతో వీరిద్దరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి వీళ్లు వీలు చిక్కినప్పుడల్లా ఇలా సోషల్‌మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులకు కనువిందుచేసేవారు. పెళ్లెప్పుడూ? అంటూ వచ్చే కామెంట్లకు కవ్వించే రిప్లైలూ ఇచ్చేవారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవడంతో తమ ఆనందాన్ని కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. కాగా 1993లో మాజీ మిస్ ఇండియా రన్నరప్ అయిన పూజాబాత్ర 2011లోనే తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. ఇక నవాబ్షా భాగ్‌మిల్కాభాగ్, లక్ష్యా తదితర చిత్రాలలో నటించాడు. ఈ మధ్య కాలంలోనే అర్జున్ కపూర్‌తో తన బంధాన్ని బహిర్గతం చేసిన మలైకా అరోరా మరో బాలివుడ్ ప్రేమ జంటగా మారిన సంగతి తెలిసిందే. -
పారిశ్రామికవేత్త ఆలంఖాన్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: నిజాం పరిపాలన కాలం నాటి పారిశ్రామికవేత్త నవాబ్ షా ఆలంఖాన్ (96) ఆది వారం అర్ధరాత్రి బర్కత్‌పురాలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఏడుగురు కుమారులు ఉన్నారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్అలీ పరిపాలనా కాలంలో ఆయన మామగారు అబ్దుల్ సత్తార్ 1929లో దక్కన్ సిగరెట్ ఫ్యాక్టరీ (గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ) స్థాపించారు. ఈ ఫ్యాక్టరీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం అన్వర్ ఉలూమ్ స్కూల్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం అన్వర్ ఉలూమ్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్, బీఎడ్, డీఎడ్, డిగ్రీ కాలేజ్‌లు కొనసాగుతున్నాయి. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, ప్రజాగాయకుడు గద్దర్, విశ్రాంత ఏసీబీ డైరెక్టర్ ఏకే ఖాన్, మాజీ మంత్రి మర్రిశశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ ఎం.అంజన్‌కుమార్ యాదవ్, సియాసత్ ఎండీ జావెద్ అలీఖాన్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీంఖాన్, ఎంఐఎం ఎమ్మెల్యే బలాల్ మోజంఖాన్, ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రి ఎండీ సురేశ్‌కుమార్ గౌడ్ తదితరులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. హిమాయత్‌నగర్‌లోని మజీద్ ఏ సలీమాఖాతూన్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. -
‘మా ఇద్దరి మధ్య అంతకుమించి ఏం లేదు’
హిందీ టీవీ తారలు కవితా కౌశిక్, నవాబ్ షా ఆకస్మికంగా గత జూలైలో విడిపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. మతం కారణంగానే వీరు విడిపోయారని ఊహాగానాలు వచ్చాయి. నవాబ్ వేరే మతానికి చెందిన వాడు కావడంతో పెళ్లికి కవిత తల్లిదండ్రులు ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. అయితే ఇందులో వాస్తవం లేదని నవాబ్ తెలిపాడు. ‘మతం ఆధారంగా ఇలాంటి వదంతులు ఎందుకు పుట్టిస్తారో అర్థం కావడం లేదు. చాలా కాలంగా ఉన్న పొరపొచ్చాల వల్లే కవిత, నేను విడిపోయాం. మేమిద్దరం బలమైన వ్యక్తిత్వాలు కలిగిన వాళ్లం. వయసు, మతం అనేవి ప్రేమకు అడ్డురావు. ఆడమగ కలిసి పనిచేసే ముంబై లాంటి మెట్రోనగరాల్లో ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు. కవిత, నేను ఐదేళ్లు కలిసివున్నాం. ఇప్పుడు ఎవరు దారులు వారు చూసుకున్నాం. ఇంతకుమించి ఏం జరగలేద’ని నవాబ్ వెల్లడించాడు. కవిత నుంచి విడిపోయిన నవాజ్ లాస్ ఏంజెలెస్ కు చెందిన సినిమాటోగ్రాఫర్ దియా బాల్కీకు దగ్గరయ్యాడు. డాన్ 2, దిల్ వాలే సినిమాల్లో నవాబ్ నటించాడు. కవిత కూడా తన పాత స్నేహితుడు రోనిత్ బిశ్వాస్ తో ప్రేమాయణం సాగిస్తోంది. కొత్త జీవితంలో నవాబ్ సంతోషంగా ఉండాలని ఆమె ఆకాంక్షించింది.