న్యూఢిల్లీ : తన చిరకాల స్నేహితుడు, నటుడు నవాబ్ షాను పెళ్లి చేసుకున్నానని నటి, మాజీ మిస్ ఇండియా పూజా బాత్రా పేర్కొన్నారు. అత్యంత సన్నిహితుల మధ్య ఢిల్లీలో తమ వివాహం జరిగిందని తెలిపారు. సోమవారం ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ...‘ నవాబ్‌ను ఇష్టపడుతున్నాని తెలిసిన తర్వాత పెళ్లికి ఎందుకు ఆలస్యం చేస్తున్నావని నా స్నేహితులు తరచూ అడిగేవారు. అయితే తనని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే... నాకు జీవితాంతం తోడుగా నిలవగలడనే నమ్మకం కుదిరిన తర్వాత వెంటనే వివాహ బంధంలో అడుగుపెట్టాలనుకున్నా. అవును.. మేము పెళ్లి చేసుకున్నాం. ఢిల్లీలో నేను, నవాబ్ పెళ్లి ప్రమాణాలు చేశాం. ఇరు కుటుంబాల సన్నిహితుల ఆధ్వర్యంలో ఆర్యసమాజ్‌లో నిరాడంబరంగా మా పెళ్లి జరిగింది. ఆ తర్వాత వివాహాన్ని రిజిస్టర్ చేయించుకున్నాం’ అని పూజ చెప్పుకొచ్చారు.
కాగా 1993లో మిస్ ఇండియాగా ఎంపికైన పూజా బాత్రా 2011లోనే తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చారు. ఇక నవాబ్ షా భాగ్‌మిల్కాభాగ్, లక్ష్యా తదితర చిత్రాలలో నటించాడు. కొన్నిరోజుల క్రితమే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట గత వారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలో పూజా బాత్రా తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment