ముంబయి : బాలివుడ్‌లో మరో ప్రేమజంట పెళ్లిచేసుకోబోతుంది?. కాదు కాదు వాళ్లు ఇప్పటికే పెళ్లి చేసేసుకున్నారని, తమ పెళ్లిని అధికారికంగా రిజిస్టర్ చేయడం ఒకటే మిగిలిందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఆ జంటే పూజా బాత్ర, నవాబ్‌షా . వీరు ఈ మధ్యనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు నవాబ్‌షా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తుంటే వీరు పెళ్లిచేసుకున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. కొత్తగా పెళ్లైన వారు ధరించే సంప్రదాయ పంజాబీ గాజులు, మెహెందీతో నిండిపోయిన పూజ చేతులను పోస్ట్ చేశాడు నవాబ్‌షా.
ఈ ఫోటోలను చూస్తుంటే వారు హనీమూన్ నుంచే పంపించారా? అనిపించేలా ఉందని ఓ అభిమాని చమత్కారంగా కామెంట్ చేశాడు. నా సహచరి కనిపించడానికి నాకు 46 సంవత్సరాలు పట్టింది అనే ట్యాగ్‌లైన్‌తో పూజతో రిలేషన్‌లో ఉన్నానంటూ నవాబ్‌షా రంజాన్ రోజున ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పోస్ట్ చేయడంతో వీరిద్దరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి వీళ్లు వీలు చిక్కినప్పుడల్లా ఇలా సోషల్‌మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులకు కనువిందుచేసేవారు. పెళ్లెప్పుడూ? అంటూ వచ్చే కామెంట్లకు కవ్వించే రిప్లైలూ ఇచ్చేవారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవడంతో తమ ఆనందాన్ని కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. కాగా 1993లో మాజీ మిస్ ఇండియా రన్నరప్ అయిన పూజాబాత్ర 2011లోనే తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. ఇక నవాబ్‌షా భాగ్‌మిల్కాభాగ్, లక్ష్యా తదితర చిత్రాలలో నటించాడు. ఈ మధ్య కాలంలోనే అర్జున్ కపూర్‌తో తన బంధాన్ని బహిర్గతం చేసిన మలైకా అరోరా మరో బాలివుడ్ ప్రేమ జంటగా మారిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment