సాక్షి, హైదరాబాద్: మేలో జరిగే ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల అర్హతలు, ఇతర అంశాల మార్గదర్శకాలను తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు మంగళవారం జారీ చేసింది.
ఇవీ మార్గదర్శకాలు...
ప్రస్తుతం జరుగుతున్న (మార్చిలో) ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఫెయిలైన విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకావచ్చు. హా ప్రస్తుత పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ కోసం కూడా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు. హా తెలంగాణ ఇంటర్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండి, మార్చిలో పరీక్షల కోసం ఫీజు చెల్లించలేకపోయిన వారు కూడా ఫీజు చెల్లించవచ్చు. హా ఏదైనా కారణాలతో మార్చిలో పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థులు నిర్ణీత ఫీజు చెల్లించి మే నెలలో పరీక్షలు రాయవచ్చు. హా ఈ విద్యార్థులంతా టీఎస్‌బీఐఈ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ క్రమంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఆర్‌ఐఓలను లేదా బోర్డు డిప్యూటీ సెక్రటరీ మోహన్‌రెడ్డిని (మొబైల్: 98487 81806) సంప్రదించవచ్చు. వెబ్‌సైట్‌లోనూ (bietelangana.cgg.gov.in) పొందవచ్చు.
అండర్ గ్రాడ్యుయేట్‌లో ‘పర్యావరణం’ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: అన్ని యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీలు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ సబ్జెక్టును కచ్చితంగా ప్రవేశపెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీ చేసింది. అలాగే ‘ఒక విద్యార్థి ఒక మొక్క’ విధానంతో ప్రతి విద్యార్థితో ఒక మొక్కను నాటించే కార్యక్రమాన్ని కాలేజీల్లో చేపట్టాలని తెలిపింది.
మే 10న టీఆర్‌జేసీసెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నాలుగు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశానికి మే 10న ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఆర్‌జేసీసెట్-2015) నిర్వహించనున్నట్లు తెలంగాణ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి శేషుకుమారి తెలిపారు. ఏప్రిల్ 18లోగా ఆన్‌లైన్‌లో http://tsrjdc.cgg.gov.in) దరఖాస్తు చేసుకోవాలని, రూ. 150 పరీక్ష ఫీజు ఉంటుందని తెలిపారు. అలాగే ఏపీలోని గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఏపీ గురుకుల విద్యాలయాల సొసైటీ మే 7న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోందని, అందులో తెలంగాణ విద్యార్థులకు కూడా సీట్లు ఇస్తారని వెల్లడించారు. హైదరాబాద్, వరంగల్ కేంద్రాల్లో పరీక్ష ఉంటుందని, ఏప్రిల్ 17లోగా ఆన్‌లైన్‌లో (aprs.cgg.gov.in)) దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.
ఫైనలియర్ బీడీఎస్ ఫలితాలు విడుదల
విజయవాడ: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫిబ్రవరిలో నిర్వహించిన ఫైనలియర్ బీడీఎస్ పరీక్షల ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. విద్యార్థుల మార్కుల రీ-టోటలింగ్ కోసం సబ్జెక్టుకు రూ.2 వేలు చొప్పున చెల్లించి ఏప్రిల్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ విజయకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలు (హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్) వెబ్‌సైట్‌లో పొందవచ్చు.