మహబూబ్‌నగర్ విద్యావిభాగం : ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో ఈ యేడాది కొంత మెరుగైంది. 45శాతం ఉత్తీర్ణతతో నాలుగు ఏళ్లకంటే కొంత మెరుగైన ఫలితాలు సాధించారు. ఎప్పటిలాగే ఈ సారి కూడా బాలికలే పై చేయి సాధించారు. బుధవారం వెలువడిన ప్రథమ సంవత్సర ఫలితాల్లో జిల్లా 45శాతం ఉత్తీర్ణత సాధించి తెలంగాణ రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. మొత్తం 34,163 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 15,261 మంది (45శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలుర విభాగంలో 17,875 మంది పరీక్షలకు హాజరు కాగా 7,134 మంది (40శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికల విభాగంలో 16,288 మంది పరీక్షలకు హాజరు కాగా 8,127 మంది (50శాతం) ఉత్తీర్ణత సాధించారు.
వొకేషన్ విభాగంలో మొత్తం 3,741మంది పరీక్షలకు హాజరు కాగా, 1354 మంది (36శాతం) ఉత్తీర్ణత సాధించారు. 2,567 మంది బాలురు పరీక్షలు రాయగా, 886 మంది (35శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికల విభాగంలో 1174 మంది పరీక్షలు రాయగా 468 మంది (40శాతం ) ఉత్తీర్ణత సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో గతేడాది 42శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లా చివరి నుంచి రెండో స్థానంలో నిలువగా, ఈ ఏడాది ఫలితాలలో 45శాతం ఉత్తీర్ణత సాధించి తెలంగాణ రాష్ట్రంలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది.
ఈ ఏడాది ఫలితాల్లో షాద్‌నగర్ విద్యార్థులు రాష్ట్రంలోనే ఉత్తమ మార్కులు సాధించారు. ఎంఈసీ విభాగంలో షాద్‌నగర్‌లోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలకు చెందిన సాయికుమార్ 491 మార్కులు సాధించి రాష్ట్రంలో ఉన్నత స్థానంలో నిలిచాడు. అదేవిధంగా సీఈసీ విభాగంలో ఇదే కాలేజీకి చెందిన సయ్యద్ ఆర్షియా 486 మార్కులు సాధించి రాష్ట్రంలో ఉన్నత స్థానంలో నిలిచాడు.
ఎంపీసీలో వనపర్తికి చెందిన స్కాల ర్స్ జూనియర్ కళాశాల విద్యార్థి పి.శ్రీనివాసులు 465 మార్కులు సాధించి జిల్లా మొదటి స్థానం సాధించగా జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు చందన, భరత్‌కుమార్‌గౌడ్‌లు 464 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. బైపీసీ విభాగంలో 435 మార్కులు సాధించి వనపర్తిలో జాగృతి జూనియర్‌కళాశాల విద్యార్థిని మెరాజ్‌బేగం జిల్లా మొదటి స్థానం సాధించగా, జిల్లా కేంద్రంలోని సిరి కళాశాలకు చెందిన ఎం.పరమేశ్వర్ 433 మార్కులు సాధించి జిల్లాలో ద్వితీయ స్థానం సాధించారు.
తెలంగాణలో 5వ స్థానంలో
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు..
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సత్తా చాటుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణతశాతం మెరుగైంది. 48శాతం ఉత్తీర్ణత సాధించి తెలంగాణ రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచాయి. 93.33శాతం ఉత్తీర్ణతతో తాడూరు జూనియర్ కళాశాల జిల్లా ప్రథమ స్థానంలో నిలువగా, 88.54శాతం ఉత్తీర్ణతతో పెబ్బేరు జూనియర్ కళాశాల రెండో స్థానంలో, 10శాతం ఉత్తీర్ణతతో కొల్లాపూర్ బాలికల జూనియర్ కళాశాల జిల్లాలో చివరిస్థానంలో నిలిచింది.
కొంత మెరుగు
Published Thu, Apr 23 2015 1:40 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement