మహబూబ్‌నగర్ విద్యావిభాగం : బీఎడ్ కోర్సులో ప్రవేశానికి శనివారం తెలంగాణ రాష్ట్రంలో ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పరీక్షల కో ఆర్డినేటర్ తహసీన్‌సుల్తానా వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లో 13 పరీక్షా కేంద్రాలు, వనపర్తిలో 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 18 పరీక్షా కేంద్రాలలో 8,420 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ పరీక్షకు గంట ముందుగానే కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలని, 10.30గంటలకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని తహసీన్‌సుల్తాన వెల్లడించారు. పరీక్ష సమయం పూర్తయిన తర్వాతనే అభ్యర్థులను బయటికి పంపిస్తామన్నారు. పరీక్ష నిర్వహణకు మొత్తం 18మంది సెంటర్ లెవల్ అబ్జర్వర్లు, 18మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు, ముగ్గురు స్పెషల్ ఆఫీసర్‌లు, 350మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని 13 పరీక్ష కేంద్రాల్లో 6,701 మంది, వనపర్తిలోని 5 కేంద్రాల్లో 1,719మంది పరీక్ష రాయనున్నారు.
మహబూబ్‌నగర్‌లో..పరీక్ష కేంద్రాలివే...
ఎన్‌టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బీఎడ్ కళాశాల, ప్రభుత్వ డైట్ కళాశాల, శ్రద్ధ జూనియర్ కళాశాల, స్వామి వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాల, ఆదర్శ డిగ్రీ కళాశాల, చైతన్య ఉన్నత పాఠశాల, ఎంవీఎస్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అల్‌మదీనా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫాతిమా విద్యాలయ, నాగార్జున కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, మహబూబ్‌నగర్ గ్రామర్ స్కూల్
వనపర్తిలో..
కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, చాణక్య ఉన్నత పాఠశాల, స్కాలర్స్ జూనియర్ కళాశాల.
నేడు ఎడ్‌సెట్
Published Sat, Jun 6 2015 12:25 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement