రాజధానిలో బీసీ భవన్ ఏర్పాటు
జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్
హైదరాబాద్: రాష్ట్రంలో 50 శాతానికిపైగా ఉన్న బీసీల సంక్షేమం, అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించడానికిగాను హైదరా బాద్‌లో 10 ఎకరాల స్థలంలో బీసీ భవన్ ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో బీసీలకు నిలువ నీడ కూడా లేదన్నారు.
ఒక శాతం కూడా లేని బ్రాహ్మణులకు సీఎం కేసీఆర్ బ్రాహ్మణ సదన్ ప్రకటిం చారని, 3% ఉన్న రెడ్డి సామాజిక వర్గం కోసం 17 ఎకరాల్లో రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భవన్‌కు ఈ నెల 22న సీఎం శంకుస్థాపన చేయనున్నారన్నారు. బీసీ భవన్ ఏర్పాటు చేయాలని మూడేళ్లుగా బీసీలు కోరుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంద న్నారు.
వెంటనే బీసీ భవన్‌కు భూమి కేటాయించి రూ. వంద కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నెలలోగా బీసీ భవన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి బీసీల సత్తా చాటుతామన్నారు. సమావేశంలో బీïసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జాజుల లింగం తదితరులు పాల్గొన్నారు.