భీమదేవరపల్లి (హుస్నాబాద్): తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీటిని అందించేందుకే సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేస్తూ నిర్మాణాలను వేగవంతం చేయిస్తున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రాజెక్టులను కట్టిస్తుంటే కాంగ్రెస్ నాయకులు కోర్టుల్లో కేసులు వేస్తూ వాటిని అడ్డుకోవడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు.
వరంగల్ అర్బన్ జిల్లా ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు 60 ఏళ్ల వేడుకలు బ్యాంకు అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగాయి. తొలుత డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు బ్యాంకు కాటన్ జిన్నింగ్ ప్లాంట్ ఆవరణలో 60 వసంతాల పైలాన్, సావనీర్‌ను ఆవిష్కరించారు. కాగా, ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు 60 వసంతాల ఉత్సవాలను పురస్కరించుకుని ‘సాక్షి’ ఆదివారం ప్రత్యేకంగా విడుదల చేసిన వీకెండ్ స్పెషల్ కథనాలు సభలో రెపరెపలాడాయి.
Comments
Please login to add a commentAdd a comment