
కల్పన తల్లిదండ్రుల ఫైల్ ఫోటో
సాక్షి, యాదాద్రి: సైకో శ్రీనివాస్‌రెడ్డి చేతిలో హత్యకు గురైన కల్పన కుటుంబ సభ్యులు కలెక్టర్ అనితారామ చంద్రన్ కాళ్లపై పడి న్యాయం చేయాలని వేడుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్, మైసిరెడ్డిపల్లిని ఆదివారం జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ సందర్శించారు. సైకో శ్రీనివాస్‌రెడ్డి చేతిలో దారుణంగా హత్యకు గురైన బాలికలు కల్పన, మనీషా, శ్రావణి కుటుంబాలను ఆమె పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా కల్పన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అభంశుభం తెలియని తమ చిన్నారి అతి కిరాతకంగా హత్యకు గురైందని వారు వాపోయారు. నిరుపేదలమైన తమ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆమె వారిని ఓదారుస్తూ ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. రావాల్సిన సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment