కేసీఆర్ సర్కార్ కాలయాపన: పొన్నాల
హైదరాబాద్: వ్యవసాయ రుణాల మాఫీపై కేసీఆర్ సర్కార్ కాలయాపన చేస్తోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. రైతు రుణమాఫీని ఆలస్యం చేయడం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారని పొన్నాల అన్నారు.
తెలంగాణ ప్రాంతంలో 77 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని పొన్నాల సూచించారు.
రైతులకు ఖరీఫ్ రుణాలిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పొన్నాల విజ్ఞప్తి చేశారు.