
అల్గునూర్ (మానకొండూర్): మొదటి విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కరకట్ట దిగువన నాటిన మొక్కను గుర్తుతెలియని వ్యక్తులు నరికివేశారు. మూడేళ్లలో మొక్క పెద్దగా పెరిగి చెట్టయింది. బుధవారం రాత్రి వరకు బాగానే ఉన్న చెట్టు గురువారం ఉదయం నరికి ఉండగా.. దాని సమీపంలోనే వినాయకుడి ప్రతిమ కనిపించింది.
సమీపంలోని ఇతర చెట్లను కూడా నరికివేశారు. దీంతో కావాలనే కొందరు ఇలా చెట్టును నరికి వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment