'కొత్త ప్రభుత్వం కాబట్టే సహకరించాం' | kcr six months rule scores five marks only, says shabbir ali | Sakshi
Sakshi News home page

'కొత్త ప్రభుత్వం కాబట్టే సహకరించాం'

Published Tue, Dec 2 2014 1:52 PM | Last Updated on Wed, Aug 15 2018 8:58 PM

'కొత్త ప్రభుత్వం కాబట్టే సహకరించాం' - Sakshi

'కొత్త ప్రభుత్వం కాబట్టే సహకరించాం'

హైదరాబాద్: కేసీఆర్ 6 నెలల పాలనలో ఏ ఒక్కహామీ కూడా అమలు కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు. చాలా హామీల్లో స్పష్టత లోపించి, సమస్యల ప్రభుత్వంగా అవతరించిందని వ్యాఖ్యానించారు.

లక్ష కోట్ల బడ్జెట్ బండారం 4 నెలల్లో బయటపడుతుందన్నారు. అన్ని రంగాల్లో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పడిపోయిందన్నారు. ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోయిందన్నారు. 6 నెలల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది 5 మార్కులేనని అన్నారు. కొత్త ప్రభుత్వం కాబట్టే బడ్జెట్ కు సహకరించామని షబ్బీర్ అలీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement