'ఫేక్ ప్రామిసెస్ పేరుతో అకౌంట్స్ తెరిచాం' | shabbir ali takes on kcr | Sakshi
Sakshi News home page

'ఫేక్ ప్రామిసెస్ పేరుతో అకౌంట్స్ తెరిచాం'

Published Fri, Mar 13 2015 4:38 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

'ఫేక్ ప్రామిసెస్ పేరుతో అకౌంట్స్ తెరిచాం' - Sakshi

'ఫేక్ ప్రామిసెస్ పేరుతో అకౌంట్స్ తెరిచాం'

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని షబ్బీర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన షబ్బీర్ అలీ..  సీఎం కేసీఆర్ ఫేక్ ప్రామిసెస్ పేరుతో ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్ లు తెరిచామని స్పష్టం చేశారు.

 

టీఆర్ఎస్ హామీలపై ప్రజల తరపున కేసీఆర్ కు ఫర్మానా పంపితే తమ కొద్దని వెనక్కు పంపారని విమర్శించారు. కేసీఆర్ హామీలపై ప్రజలే స్పందించే రోజు తప్పకుండా వస్తుందన్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఫేక్ ప్రామిసస్ పేరుతో ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్ లు తెరిచామని.. దీంతో కేసీఆర్ ప్రభుత్వ తీరును ఎండగడతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement