బస్సు అద్దాలు ధ్వంసం చేసిన దుండగులు | known people break bus glasses in medak district | Sakshi
Sakshi News home page

బస్సు అద్దాలు ధ్వంసం చేసిన దుండగులు

Published Tue, Jun 7 2016 1:54 PM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM

known people break bus glasses in medak district

మెదక్ : ఆగంతకులు మూడు బస్సు అద్దాలను పగలగొట్టిన సంఘటన మంగళవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లో చోటు చేసుకుంది. బాధితుని కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నర్సింహులు జగదేవ్‌పూర్‌లోనే ఎస్‌విఎన్ ప్రైవేట్ పాఠశాలను నడుపుతున్నారు. అయితే తనకున్న మూడు బస్సులను పాఠశాల అవరణలో ప్రతి రోజులాగా నిలిపి ఉంచారు.

అయితే సోమవారం రాత్రి వరకు బాగానే ఉన్నా బస్సులు మంగళవారం ఉదయం చూసేసరికి మూడు బస్సుల అద్దాలు పగలిపొయి ఉన్నాయి. దీంతో పాఠశాల కరస్పాండెంట్ నర్సింహులు వెంటనే ఎస్‌ఐ వీరన్నకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ వీరన్న పాఠశాలకు చేరుకుని బస్సులను పరిశీలించారు. బాధితుడు మాట్లాడుతూ సుమారు రూ.లక్ష వరకు అస్థి నష్టం జరిగిందన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement