
సాక్షి, హైదరాబాద్: గురుకుల టీచర్ల నియామకాలలో టీఎస్‌పీఎస్‌సీ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయలేదని, దానిపై విచారణ జరిపించాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని బీసీ కమిషనర్ కార్యాలయాన్ని నిరుద్యోగులతో కలిసి ముట్టడించారు. ముట్టడి అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ బి.ఎస్.రాములు, వి.కృష్ణ మోహన్, ఆంజనేయులు గౌడ్, గౌరి శంకర్‌తో కూడిన బెంచ్ ముందు నిరుద్యోగులతో కలిసి సమావేశమై పలు అభిప్రాయాలను వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment