ప్రాణం తీసిన కు.ని ఆపరేషన్ | kuni the operation took its toll and the dead | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన కు.ని ఆపరేషన్

Published Wed, Oct 25 2017 12:53 PM | Last Updated on Wed, Oct 25 2017 12:53 PM

kuni the operation took its toll and the dead

సాక్షి, మహబూబ్‌నగర్‌ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. భూత్పూర్ మండలం తాటికొండకు చెందిన నాగలక్ష్మి అనే మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన ను ఉస్మానియా ఆసుపత్రిలో చేయించుకుంది. అయితే.. అది వికటించడంతో నాగలక్ష్మీ మృతిచెందింది.

కాగా నాగలక్ష్మీ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ తాటికొండ గ్రామంలో బంధువులు బుధవారం ఉదయం ఆందోళన నిర్వహించారు. సమాచారమందుకున్న ఆర్డీవో లక్ష్మీనారాయణ, డీఎస్పీ భాస్కర్ తదితరులు ఆ గ్రామానికి చేరుకుని నాగలక్ష్మీ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వంతో ఆందోళన విరమించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement