
జెడ్పీ సీఈఓగా విధులు స్వీకరిస్తున్న లక్ష్మినారాయణ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా పరిషత్ సీఈఓగా ఆర్డీఓ లక్ష్మీనారాయణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇన్నాళ్లూ ఇక్కడ సీఈఓగా కొమరయ్య విధులు నిర్వహిస్తూ వచ్చారు. రాష్ట్ర రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఆయనను 2017 ఏప్రిల్ 3న ఏడాది కాలానికి గాను డిప్యూటేషన్‌పై పంపించారు. ఆయన డిప్యూటేషన్ ముగియడంతో మళ్లీ హైదరాబాద్‌కు బదిలీ చేశారు.
ఈ మేరకు మహబూబ్‌నగర్ ఆర్డీఓగా విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మీనారాయణకు ఇన్‌చార్జి జెడ్పీ సీఈఓగా నియమిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. లక్ష్మీనారాయణ 2015 మే 5 నుంచి 2017 ఏప్రిల్ 2వ తేదీ వరకు కూడా జెడ్పీ సీఈఓగా విధులు నిర్వర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment