అయిజ నగరపంచాయతీ కార్యాలయంలో మూలన పడిన ఎల్‌ఈడీ బల్బులు
గద్వాల్/అయిజ (అలంపూర్): కొన్ని నెలలుగా నగరపంచాయతీ పరిధిలో వీధిలైట్లు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రివేళ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి అయిజ పట్టణానికి మూడు వేల ఎల్‌ఈడీ బల్బులు కావాలని అధికారులు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనికి స్పందించిన ఉన్నతాధికారులు గత నవంబర్‌లో నగరపంచాయతీకి రెండు విడతలుగా 1,100 పంపిం చారు. అయితే పట్టణంలో ఇంతవరకు వీటిలో 500మాత్రమే విద్యుత్ స్తంభాలకు అమర్చారు. మూడో తీగ లేకపోవడంతో మిగతావి అమర్చలేకపోయారు. వాటి స్థానంలో ఇతర బల్బులు ఉండటంతో అవి రాత్రీపగలు వెలిగి తక్కువ కాలంలోనే కాలిపోతున్నాయి. ఇదిలాఉండగా 2014–15 ఆర్థిక సంవత్సరంలో ట్రాన్స్‌కోకు విద్యుత్ బిల్లుల కింద రూ.3.4లక్షలు చెల్లించారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రస్తు తం ఈ బకాయిలు రూ.4.5కోట్లకు చేరుకున్నాయి. దీంతో ట్రాన్స్‌కో అధికారులు పట్టణంలోని విద్యుత్ స్తంభాలకు మూడో తీగ ఏర్పాటు చేయడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment