సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో, ప్రధానంగా పాలమూరు ప్రాజెక్టుల విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పొద్దున లేచింది మొదలు సీఎం కేసీఆర్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై మండిపడ్డారు.
టీఆర్ ఎస్ ఎల్పీ కార్యాలంలో ఆయన ఆదివారం మాజీ ఎంపీ మందా జగన్నాథంతో కలిసి విలేకరులతో మాట్లాడిన ఆయన.. బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు తెలంగాణపై నిజంగా ప్రేమ ఉంటే ఢిల్లీ వెళ్లి అధిక నిధుల కోసం కొట్లాడాలని హితవు పలికారు.
తెలంగాణ రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవడం లేదని కిషన్‌రెడి ఆరోపించడం దారుణమని, కొత్త రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా, రూ.17వేల కోట్లు రుణ మాఫీలో ఇప్పటికే రూ.7వేల కోట్లు బాంకులకు చెల్లించిన విషయం తెలియదా అని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరడంతో వీరికి ఏమీ పాలుపోవడం లేదన్నారు.
దళిత ఎమ్మెల్యేలపై కక్ష గట్టిన డికె అరుణ కుటుంబం తమ భూస్వాయ్య నైజాన్ని చాటుకున్నారని మాజీ ఎంపీ మంద జగన్నాథం దుయ్యబట్టారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
బీజేపీపై పాలమూరు టీఆర్ఎస్ నేతల ఫైర్
Published Sun, Sep 6 2015 5:57 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement