కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా ఎంపిక చేయండి | Make the smart City choice in Karimnagar | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా ఎంపిక చేయండి

Published Thu, May 26 2016 3:11 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా ఎంపిక చేయండి - Sakshi

కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా ఎంపిక చేయండి

వెంకయ్యనాయుడుకు ఎంపీ వినోద్‌కుమార్ వినతి

కరీంనగర్ : కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీ జాబితాలోకి చేర్చాలని ఎంపీ బి.వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్.వేణుగోపాలాచారి బుధవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడును ఢిల్లీలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్చాలని సీఎం కేసీఆర్, మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావు, ఎంపీ వినోద్‌కుమార్, మేయర్ రవీందర్‌సింగ్‌తోపాటు బీజేపీ నాయకులు పూర్తి వివరాలతో తనకు నివేదిక అందజేశారన్నారు.

దేశావ్యాప్తంగా ఎంపిక చేసిన వంద స్మార్ట్‌సిటీల్లో తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాలు ఉన్నాయని, కేసీఆర్ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ స్థానంలో కరీంనగర్‌ను ఎంపిక చేయనున్నామని తెలిపారు. మార్గదర్శకాల్లో స్వల్పమైన మార్పులు చేసి, విధానపరమైన నిర్ణయం తీసుకొని, త్వరలోనే కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా ప్రకటిస్తామని వెల్లడించారు. కాగా.. కరీంనగర్ స్మార్ట్‌సిటీగా ఎంపిక అయిపోయినట్లేనని, విధానపరమైన ప్రకటన వెలువడడానికి కొంత సమయం పడుతుందని ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిని, అదనపు కార్యదర్శిని, స్మార్ట్‌సిటీస్ మిషన్ డెరైక్టర్‌ను కలిసి అవసరమైన నివేదిక అందజేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement