ఏటూరు నాగారం: వరంగల్ జిల్లా ఏటూరునాగారంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. రేసు హన్మంతు (31) మండల కేంద్రంలోని నందమూరి నగర్‌లో నివాసం ఉంటున్నాడు. శనివారం ఉదయం ఇంటి దగ్గర రక్తపు మడుగులో విగతుడిగా పడి ఉన్న అతడ్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పాత కక్షల నేపథ్యంలో హన్మంతును గుర్తుతెలియని దుండగులు హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. హన్మంతు భార్య కొద్ది రోజుల క్రితమే పుట్టింటికి వెళ్లగా ఒక్కడే ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.