తల్లాడ: తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని, విచారణ జరపించాలని కోరుతూ ఖమ్మం జిల్లా తల్లాడ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. మండలంలోని కుర్నవల్లి గ్రామానికి చెందిన ఎక్కిరాల నాగేశ్వరరావు (40) ఈ నెల 2న తన ఇంటి ఆవరణలో మృతి చెందాడు. రెండు రోజుల తర్వాత నాగేశ్వరరావు మృతదేహాన్ని సమాధి చేశారు.
అయితే, తన భర్త మృతిపై అనుమానాలున్నాయంటూ మృతుడి భార్య దానమ్మ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త స్నేహితులపై అనుమానం ఉన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎస్‌ఐ భాను ప్రకాశ్ మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి
Published Sat, Sep 5 2015 7:46 PM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM
Advertisement
Advertisement