సిద్ధిపేటలో పోస్టర్ కలకలం | maosists wrote letter in medak district siddipet | Sakshi
Sakshi News home page

సిద్ధిపేటలో పోస్టర్ కలకలం

Published Thu, Apr 30 2015 11:24 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM

maosists wrote letter in medak district siddipet

సిద్ధిపేట: మెదక్ జిల్లా సిద్ధిపేటలో మావోయిస్టుల పేరుతో వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.  మావోయిస్టు నేత జగన్ పేరిట గుర్తు తెలియని వ్యక్తులు జిల్లాలోని సిద్దిపేట ఆర్డీవో కార్యాలయానికి వాల్ పోస్టర్ అతికించడంతో ఈ కలకలం రేగింది. ఆ పోస్టర్ లో మొత్తం 10 డిమాండ్లను రాసి కార్యాలయ గోడకి అంటించారు. ' మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా రైతులకు ఉచితంగా ట్రాక్టర్లలో మట్టి పోయాలి. బీడీ కార్మికులందరికి పీఎఫ్‌తో నిమిత్తం లేకుండా జీవనభృతి కల్పించాలి. ప్రస్తుతం పనిచేయని బీడీ కార్మికులకు కూడా భృతి చెల్లించాలి.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన ప్రభుత్వ సబ్సిడీలు రాజకీయ నాయకులు, అధికారులకే సొంతమవుతున్నాయి. రియల్టర్లు, బ్రోకర్లతో కలిసి వీరు రైతుల భూములు తక్కువ ధరలకే లాగేసుకుంటున్నారు. ఇలా అనేక మోసాలకు పాల్పడుతున్న వారు చివరికి మూల్యం చెల్లించక తప్పదు' ని వారు అందులో హెచ్చరించారు. కలకలం రేపుతున్న ఈ పోస్టర్ దిగువన 'పీపుల్స్ వార్' అని రాసి ఉండడం పలు సందేహాలను రేపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement