అంచెలంచెలుగా ఎదిగిన వడ్డేపల్లి
- కూకట్‌పల్లి నియోజకవర్గంలో తనదైన ముద్ర
- నివాళులర్పించేందుకు తరలివచ్చిన ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, నేతలు
కూకట్‌పల్లి,న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ వడ్డేపల్లి నర్సింగ్‌రావు మృతి విషయం తెలుసుకున్న వివిధ పార్టీల రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులతోపాటు కూకట్‌పల్లి నియోజకవర్గం ప్రజలు వేలాదిగా తరలివచ్చి వడ్డేపల్లి మృతదేహానికి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావు,మాజీమంత్రి ధర్మానప్రసాదరావుతోపాటు వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పీఎన్వీప్రసాద్, పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమన్వయకర్త కొలన్ శ్రీనివాస్‌రెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, విజయ్‌చందర్, గట్టురామచందర్‌రావు, మావులేటి వెంకటరాజు, జంపన ప్రతాప్, వద్దిరెడ్డి చలమారెడ్డితోపాటు పలువురు ప్రముఖులు తరలివచ్చి నివాళులర్పించి వడ్డేపల్లి కుటుంబసభ్యులను పరామర్శించారు.
తరలివచ్చిన టీఆర్‌ఎస్,టీడీపీ ఎమ్మెల్యేలు : వడ్డేపల్లి నర్సింగ్‌రావు మరణవార్త తెలుసుకున్న వెంటనే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్‌రావు, జూపల్లి కృష్ణారావు, పి.మహేందర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ సీహెచ్.మల్లారెడ్డి, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికపూడి గాంధీ, మాజీఎమ్మెల్యేలు బిక్షపతియాదవ్, కూన శ్రీశైలంగౌడ్, చందర్‌రావు, మాజీఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎమ్మెల్సీ భానుప్రసాద్, టీఆర్‌ఎస్ నియోజకవర్గం ఇంచార్జ్ గొట్టిముక్కల పద్మారావు, కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు, మాధవరం రంగారావు, కృష్ణారావు, బాబురావు, వెంకటసామ్రాజ్యం, వైఎస్సార్‌సీపీ జీడిమెట్ల కార్పొరేటర్ సురేష్‌రెడ్డిలతోపాటు పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, వివిధ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చి వడ్డేపల్లి అంతిమయాత్రలో, అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
అంచెలంచెలుగా ఎదిగి : కూకట్‌పల్లి నియోజకవర్గంలో అంచెలంచెలుగా ఎదిగిన వడ్డేపల్లి నర్సింగ్‌రావు తన రాజకీయ ప్రస్తానంలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పర్చుకున్నారు. కూకట్‌పల్లి గ్రామం నుంచి రాజకీయాల్లోకొచ్చిన ఆయన రాష్ట్ర, జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సేవలందించారు. పీజేఆర్‌తో పనిచేసిన సమయంలో కూడా కూకట్‌పల్లిలో పెద్దమనిషిగా చెలామణై మొదటిస్థానంలో నిలిచారు.
అనంతరం వైఎస్.రాజశేఖర్‌రెడ్డితో సన్నిహితంగా ఉంటూ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా సేవలందించారు. మహానేత మరణానంతరం జగన్‌కు అండగా ఉండాలని వైఎస్సార్సీపీలో చేరారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు.