కుటుంబ కలహాలతోనే.. | marred woman died in Gangaraju village | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతోనే..

Published Sun, Jul 19 2015 11:17 PM | Last Updated on Sun, Sep 3 2017 5:48 AM

marred woman died in Gangaraju village

మండలంలోని వల్లభాపురానికి చెందిన లక్ష్మికి రేగులగడ్డతండాకు చెందిన గంగరాజుతో 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు ప్రశాంత్(12), కూతురు యమున జన్మించారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
 
 వారం రోజులుగా గొడవలు
 గంగరాజు, లక్ష్మి దంపతుల మధ్య వారం రోజలుగా గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది. గంగరాజుకు గ్రామంలోనే మరో మహిళతో వివాహేత సంబంధం ఉన్న సంగతిని తెలుసుకుని లక్ష్మి నిలదీయడంతో గొడవలు జరుగుతున్నాయి. దీంతో కోపోద్రిక్తుడైన భర్త గంగరాజు లక్ష్మిని తీవ్రంగా కొట్టినట్టు ఆమె ఒంటిపై కనిపిస్తున్న  దెబ్బలే  సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దీంతో లక్ష్మి ఇక తాను బలకనని గ్రామస్తులతో సైతం చెప్పినట్టు పేర్కొన్నారు. ఈలోగా అన్నంత పని చేసింది. తాను చనిపోతానంది కాని పిల్లలను చంపుకుంటుందని భావించలేదని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.
 
 అన్నం తినిపించి.. ఆపై..
 కుటుంబ తగాదాలకు విసిగి వేసారిన లక్ష్మి ఎలాగైనా పిల్లలు, తాను  తనువు చాలించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం లక్ష్మి తన కుమారుడు ప్రశాంత్, కూతురు యమునకు కడుపునిండా అన్నం తినిపించినట్టు స్థానికులు పేర్కొన్నారు. ఆపై వారికి ఏం చెప్పిందో తెలియదుకానీ ఇద్దరినీ తీసుకుని గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని వాపోతున్నారు.
 
 పచ్చని సంసారంలో అనుమానం చిచ్చురేపింది..తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే వదంతులను ఆమె జీర్ణించుకోలేకపోయింది.. కుటుంబంలో తగాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మానసిక వేదనకు గురైన ఆ ఇల్లాలు తనువుచాలించాలనుకుంది... తాను చనిపోతే ఇద్దరు పిల్లలు ఆలనాపాలనా పట్టించుకోరని, వారిని కడతేర్చిన తరువాతే తానూ చనిపోవాలనుకుంది.. ఇదీ.. నిడమనూరు మండలం రేగులగడ్డ తండాలో శక్రవారం ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి తాను పురుగులమందు తాగడానికి వెనుక ఉన్న కారణాలు. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు..
 - నిడమనూరు
 
 అశ్రునయనాల మధ్య చిన్నారుల అంత్యక్రియలు
 తల్లి చేతిలో తనువుచాలించిన ప్రశాంత్, యమునల మృతదేహాలకు ఆదివారం రాత్రి  రేగులగడ్డతండాలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం సాయంత్రం మృతదేహాలను రేగులగడ్డకు తీసుకొవచ్చారు. చిన్నారుల మృతదేహాలను చూసి బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎందుకే తల్లి ఇలా చేశావ్, నువ్వు పోయి బిడ్డలు బతికినా మేమన్నా చూసుకుందువుము కదా అంటూ బంధువులు వాపోయారు. తండ్రి మీద కోపంతో పిల్లలను బలితీసుకుందని అందరూ అనుకుంటున్నారు.
 
 పిల్లలు ఊపిరొదిలాకనే..
 గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లగానే లక్ష్మి తొలుత తన ఇద్దరు పిల్లలను తోసేసింది. ఆపై వారు ఊపిరి వదిలారని తెలుసుకున్న తరువాతే తాను బావిలోకి దూకింది. అయితే ఈత రావడంతో చనీపోవడం వీలుకాక తడిబట్టలతోనే ఇంటికొచ్చి పురుగులమందు తాగినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో కోలుకుంటున్నట్టు గ్రామస్తులు తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement