gangaraju
-
గ్యాంగ్ స్టర్ గంగరాజు: ‘ఏమో ఇలాగా’ అనే పాట విడుదల..!!
వరుస విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న హీరో లక్ష్ చదలవాడ. 'వలయం' వంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ హీరో ప్రస్తుతం మరో వైవిధ్యభరితమైన సినిమా చేస్తున్నాడు. `గ్యాంగ్‌స్టర్ గంగరాజు` అనే వెరైటీ సినిమాతో మరొకసారి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంభందించిన ఫస్ట్‌లుక్ విడుదల కాగా ప్రేక్షకులను ఈ లుక్ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ లుక్ ఎంతో డిఫరెంట్‌గా ఉండడంతో పాటు ఆసక్తికరంగా ఉందని ప్రేక్షకులు తెలియజేశారు. మంచి అభిరుచి గల దర్శకుడు ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాకి సంభందించిన తొలి పాటను విడుదల చేసింది చిత్ర బృందం. 'ఏమో ఇలాగా' అంటూ మొదలయిన ఈ పాట ను హేమచంద్ర ఆలపించగా, భాస్కర భట్ల రచించారు. అనీష్ మాస్టర్ కోరియోగ్రఫీలో ఈ పాట చిత్రీకరణ కాగా ప్రముఖ ఆడియో సంస్థ మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ పాట విడుదల అయ్యింది. లక్ష్ చదలవాడ హీరోగా నటించిన వలయం సినిమాలోని నిన్ను చూశాకే అనే పాట 12 మిలియన్స్ కు చేరుకోవడం విశేషం. -
బోటు ప్రమాదం రోజు సెలవులో ఉన్నా..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిలో బోటు బోల్తా పడి 22 మంది మృతి చెందిన ఘటనకు తనను బాధ్యుడిని చేసి సస్పెండ్ చేయడంపై పర్యాటక శాఖ డిప్యూటీ మేనేజర్ వీవీఎస్ గంగరాజు హైకోర్టును ఆశ్రయించారు. ప్రమాదం జరిగినప్పుడు మెడికల్ లీవులో ఉన్నందున తనపై విధించిన సస్పెన్షన్ చెల్లదని పిటిషన్ దాఖలు చేశారు. తనను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్స్ అమలును నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జీవీ శివాజీ వాదనలు వినిపిస్తూ.. బోటు ప్రమాదానికి, పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. పిటిషనర్ కొద్ది రోజులుగా అనారోగ్య కారణాలతో మెడికల్ లీవ్‌లో ఉన్నారని వివరించారు. ఘటన జరిగిన రోజు కూడా సెలవులోనే ఉన్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాలన్నీ ఉన్నతాధికారులకు తెలుసని.. అయినా కూడా పిటిషనర్‌పై సస్పెన్షన్ వేటు వేశారని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. కొద్ది నెలలుగా పిటిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ నిర్లక్ష్యం వల్లే బోటు ప్రమాదం జరిగిందని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా బోటు తిరుగుతోందని తెలిసినా పట్టించుకోలేదన్నారు. గంగరాజు సస్పెన్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని, కొంత గడువు కావాలని కోరారు. ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి.. విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు. -
అన్యాయంపై ఆగ్రహం
సాక్షి, విజయవాడ: కృష్ణానదిలో బోటు ప్రమాదం ఘటన నేపథ్యంలో ఆ శాఖకు చెందిన ఏడుగురు సిబ్బందిని సస్పెండ్ చేయడంపై మిగిలిన వారు రగిలిపోతున్నారు. బోట్లకు అడ్డగోలుగా అనుమతులు రావడానికి కారణమైన మంత్రులు, వారి బంధువులు, వారికి సహకరించిన ఉన్నతాధికారులను వదిలేసి, కిందస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఏకపక్ష విచారణ అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం పోరాటానికి సిద్ధమవుతున్నారు. నిజం చెబితే సస్పెన్షన్ వేటే..!? కృష్ణానదిలో తిరుగుతున్న బోట్లకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు చెందిన ముఖ్య అధికారి ఒకరు అనుమతులు ఇచ్చారు. అయితే ఆయనే బోటు ప్రమాదంపై విచారణ చేసి ప్రాథమిక నివేదిక అందించారు. ఈ నివేదిక ఆధారంగానే పర్యాటక శాఖామంత్రి అఖిలప్రియ సస్పెండ్ చేశారు. ఆయన చేసిన విచారణపైనా సిబ్బంది తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందిని విచారించేటప్పుడు తమకు అనుకూలంగా సమాధానాలు రాబట్టుకునేందుకు ప్రయత్నించారని తెలిసింది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధుల ఒత్తిడితోనే అనుమతి లేని బోట్లు తిరిగాయంటూ చెప్పినట్లు సమాచారం. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులే బోట్లు ప్రారంభోత్సవం చేయడం, యూనియన్ నేతలు విచారణలో చెప్పినట్లు తెలిసింది. పర్యాటక సంస్థ జెట్టిలను ప్రైవేటు సంస్థలు ఆక్రమించుకున్నప్పుడు, నదిలో ప్రైవేటు సంస్థల పెత్తనం పెరిగినప్పుడు డివిజన్ స్థాయి అధికారులు ఉన్నతస్థాయి అధికారులు దృష్టికి తీసుకువెళ్లినప్పుడే వారు స్పందించి ఉంటే 22 మంది ప్రాణాలు పోయేవి కాదని కొంతమంది సిబ్బంది వివరించారని సమాచారం. ఉన్నత స్థాయి అధికారులు చేసిన పొరపాట్లు వల్లనే బోటు ప్రమాదం జరిగిందని చెప్పబోయిన కొంతమంది సిబ్బందిని సస్పెండ్ చేస్తామంటూ బెదిరించి నోర్లు మూయించారని తెలిసింది. హైకోర్టుకు డీవీఎం గంగరాజు మెడికల్ లీవులో ఉన్న డివిజనల్ మేనేజర్ గంగరాజును అధికారులు సస్పెండ్ చేశారు. ఈ అంశంపై ఆయన హైకోర్టుకు వెళ్తున్నట్లు తెలిసింది. తాను సెలవులో ఉన్నప్పుడు జరిగిన ఘటనకు తనను బాధ్యుడిని చేయడాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా ఆయన గతంలో ప్రైవేటు ఆపరేటర్లు అడ్డగోలుగా వ్యవహరిస్తుంటే అడ్డుకున్నారు. అప్పట్లో ఇది వివాదం కావడంతో ఉన్నతాధికారులు సూచన మేరకు కొద్ది రోజులు సెలవుపై వెళ్లారు. అప్పుడు ప్రైవేటు ఆపరేటర్లకు మద్దతుగా ఉన్న అధికారులు ఇప్పుడు గంగరాజును బాధ్యుణ్ణి చేస్తూ సస్పెండ్ చేయడంపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోటు డ్రైవర్ గేదెల శ్రీను, అసిస్టెంట్ మేనేజర్ కొల్లి శ్రీధర్‌కు ప్రైవేటు సంస్థల్లో వాటాలున్నాయని బదిలీ చేశారు. అప్పుడే ఉన్నతాధికారులు నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేసి ఉంటే ప్రమాదం జరిగేదికాదని అంటున్నారు. ఉద్యోగానికి భద్రత ఏదీ? పర్యాటక సంస్థలో 80శాతం మంది కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగులే. ప్రస్తుతం జరిగిన సస్పెన్షన్లతో వీరిలో అభద్రతా భావం పెరిగిపోయింది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చేసిన తప్పులకు సంస్థలో పనిచేసిన కిందస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేశారని, భవిష్యత్తులో తమపై ఆ విధంగా చేయని తప్పులకు వేటు వేయరనే గ్యారంటీ ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో కృష్ణానదిపై ప్రైవేటు సంస్థలు ఆజమాయిషి పెరిగినప్పుడు ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. అప్పట్లో అభ్యంతరాలు చెప్పినవారే ఇప్పడు బలయ్యారని అంటున్నారు. -
కమలాపురం బాలుడు పుట్టపర్తిలో ప్రత్యక్షం
బుక్కపట్నం(పుట్టపర్తి) : వైఎస్సార్ జిల్లా కమలాపురానికి చెందిన భారతి, రాజు దంపతుల కుమారుడు గంగరాజు(8) అనంతపురం జిల్లా పుట్టపర్తిలో మంగళవారం ప్రత్యక్షమయ్యాడు. కొత్తచెరువు సీఐ శ్రీధర్, ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి కథనం మేరకు..గంగరాజు ఇంటి నుంచి పారిపోయి వచ్చి గుత్తిలో దిగి, అక్కడి నుంచి మరో రైలులో పుట్టపర్తి చేరుకున్నాడు. ఇక్కడి రైల్వే స్టేషన్లో తచ్చాడుతుండగా.. పోలీసులు గమనించి బాలుడ్ని చేరదీశారు. వివరాలు అడిగి అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పిలిపించారు. అనంతరం సురక్షితంగా వారికి అప్గించారు. అందుకు పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
ఎంపీ వ్యాఖ్యలపై ఎగసిన నిరసన
భీమవరం : గోదావరి మెగా ఆక్వాఫుడ్‌పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా రెండున్నరేళ్లుగా 40 గ్రామాల ప్రజలు పోరాటం చేస్తుంటే పట్టించుకోని నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు ఈ పరిశ్రమవల్ల ఎటువంటి కాలుష్యం ఉండదని చెప్పడం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమని ఫుడ్‌పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు తీవ్రంగా దుయ్యబట్టారు. భీమవరంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో పోరాట కమిటీ నాయకులు మాట్లాడారు. పోరాట కమిటీ కన్వీనర్ ఆరేటి వాసు మాట్లాడుతూ భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో నిర్మిస్తున్న ఆక్వాపార్క్ కారణంగా తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాలతో సహా 40 గ్రామాలు కాలుష్యం బారినపడి ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారన్నా రు. ఫ్యాక్టరీలో కలుషిత జలాలు గొంతేరు డ్రెయి¯ŒSలో కలవడం వల్ల నీరు కలుషితమై వరి, రొయ్యలు, చేపలు సాగుచేసే రైతులతో పాటు చేపలవేట సాగించే మత్స్యకారుల జీవనోపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ గురించి, ప్రజల ఇబ్బందుల గురించి ఏమీ తెలియని ఎంపీ గంగరాజు ఏకపక్షంగా మాట్లాడటం దారుణమని చెప్పారు. ఎంపీ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని పోరాట కమిటీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరిశ్రమను తరలించాలి త్రిమూర్తులు మాట్లాడుతూ వేండ్రలోని ఎంపీ గంగరాజు డెల్టాపేపర్ మిల్లు కారణంగా యనమదుర్రు డ్రెయి¯ŒS కాలుష్యం బారిన పడగా గంగరాజు మాత్రం కాలుష్యం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణం ఆక్వా పరిశ్రమను తరలించాలని డిమాండ్ చేశారు. దళితుల మధ్య చిచ్చు జొన్నలగరువు గ్రామానికి చెందిన తాడి దానియేలు మాట్లాడుతూ దళితుల్లో చిచ్చుపెట్టి ఫ్యాక్టరీ యాజమాన్యం పబ్బం గడుపుకోవాలని చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాలర్పించి అయినా ఫ్యాక్టరీని అడ్డుకుంటామని చెప్పారు. యర్రంశెట్టి సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. దిష్టిబొమ్మ దహనం భీమవరం ప్రకాశంచౌక్‌లో ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ఎంపీ గంగరాజు దిష్టిబొమ్మను దహనం చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయం నుంచి దిష్టిబొమ్మతో ప్రదర్శనగా ప్రకాశంచౌక్కు చేరుకుని ఎంపీకి వ్యతిరేకంగా కొద్దిసేపు నినాదాలు చేశా రు. ప్రజల ఓట్లతో గెలిచిన గంగరాజు ఫ్యాక్టరీ ఎక్కడ కడుతున్నారో కూడా తెలుసుకోకుండా పరిశ్రమ యాజమాన్యానికి అనుకూలంగా మాట్లాడటం దారుణమని, తక్షణం ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. -
కుటుంబ కలహాలతోనే..
మండలంలోని వల్లభాపురానికి చెందిన లక్ష్మికి రేగులగడ్డతండాకు చెందిన గంగరాజుతో 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు ప్రశాంత్(12), కూతురు యమున జన్మించారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారం రోజులుగా గొడవలు గంగరాజు, లక్ష్మి దంపతుల మధ్య వారం రోజలుగా గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది. గంగరాజుకు గ్రామంలోనే మరో మహిళతో వివాహేత సంబంధం ఉన్న సంగతిని తెలుసుకుని లక్ష్మి నిలదీయడంతో గొడవలు జరుగుతున్నాయి. దీంతో కోపోద్రిక్తుడైన భర్త గంగరాజు లక్ష్మిని తీవ్రంగా కొట్టినట్టు ఆమె ఒంటిపై కనిపిస్తున్న దెబ్బలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దీంతో లక్ష్మి ఇక తాను బలకనని గ్రామస్తులతో సైతం చెప్పినట్టు పేర్కొన్నారు. ఈలోగా అన్నంత పని చేసింది. తాను చనిపోతానంది కాని పిల్లలను చంపుకుంటుందని భావించలేదని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. అన్నం తినిపించి.. ఆపై.. కుటుంబ తగాదాలకు విసిగి వేసారిన లక్ష్మి ఎలాగైనా పిల్లలు, తాను తనువు చాలించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం లక్ష్మి తన కుమారుడు ప్రశాంత్, కూతురు యమునకు కడుపునిండా అన్నం తినిపించినట్టు స్థానికులు పేర్కొన్నారు. ఆపై వారికి ఏం చెప్పిందో తెలియదుకానీ ఇద్దరినీ తీసుకుని గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని వాపోతున్నారు. పచ్చని సంసారంలో అనుమానం చిచ్చురేపింది..తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే వదంతులను ఆమె జీర్ణించుకోలేకపోయింది.. కుటుంబంలో తగాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మానసిక వేదనకు గురైన ఆ ఇల్లాలు తనువుచాలించాలనుకుంది... తాను చనిపోతే ఇద్దరు పిల్లలు ఆలనాపాలనా పట్టించుకోరని, వారిని కడతేర్చిన తరువాతే తానూ చనిపోవాలనుకుంది.. ఇదీ.. నిడమనూరు మండలం రేగులగడ్డ తండాలో శక్రవారం ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి తాను పురుగులమందు తాగడానికి వెనుక ఉన్న కారణాలు. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. - నిడమనూరు అశ్రునయనాల మధ్య చిన్నారుల అంత్యక్రియలు తల్లి చేతిలో తనువుచాలించిన ప్రశాంత్, యమునల మృతదేహాలకు ఆదివారం రాత్రి రేగులగడ్డతండాలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం సాయంత్రం మృతదేహాలను రేగులగడ్డకు తీసుకొవచ్చారు. చిన్నారుల మృతదేహాలను చూసి బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎందుకే తల్లి ఇలా చేశావ్, నువ్వు పోయి బిడ్డలు బతికినా మేమన్నా చూసుకుందువుము కదా అంటూ బంధువులు వాపోయారు. తండ్రి మీద కోపంతో పిల్లలను బలితీసుకుందని అందరూ అనుకుంటున్నారు. పిల్లలు ఊపిరొదిలాకనే.. గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లగానే లక్ష్మి తొలుత తన ఇద్దరు పిల్లలను తోసేసింది. ఆపై వారు ఊపిరి వదిలారని తెలుసుకున్న తరువాతే తాను బావిలోకి దూకింది. అయితే ఈత రావడంతో చనీపోవడం వీలుకాక తడిబట్టలతోనే ఇంటికొచ్చి పురుగులమందు తాగినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో కోలుకుంటున్నట్టు గ్రామస్తులు తెలిపారు. -
గంగరాజు పాలు గరిటెడైనను...
తెల్లవారగానే పాలకార్డు పుచ్చుకుని పాల బూత్‌కి వెళ్తే పాలు దొరుకుతాయి! కాని ఆ ఇంటికి ఏ కార్డూ తీసుకువెళ్లక్కర్లేదు... అర్ధరాత్రి ఒంటి గంటకైనా సరే ఆ ఇంటికి వెళ్లి తలుపు త డితే చాలు.. పాల వంటి స్వచ్ఛమైన చిరునవ్వుతో తలుపులు తెరుచుకుంటాయి... మనకు కావలసిన కల్తీ లేని పాలు దొరుకుతాయి... మూడు తరాలుగా పాల వ్యాపారాన్ని సేవా దృక్పథంతో నడుపుతూ పాల గంగరాజుగా పేరు పొందారు ఆయన... తరవాతి తరం కూడా అదే పేరుతో అ వ్యాపారాన్ని అందిపుచ్చుకున్నారు. రాజమండ్రి టి.నగర్‌లోని ఆ వీధిలోకి అడుగు పెడుతుండగానే ఆమడ దూరం నుంచే కమ్మటి వాసనలు కమ్ముకు వస్తుంటే... అప్రయత్నంగానే మన కాళ్లు అటువైపు దారి తీస్తాయి. ఆ ఇంటి ముందు బారులు తీరిన జనం కనిపిస్తారు. ఒకరు నెయ్యి కావాలంటే, ఒకరు పాలు కావాలంటారు. ఒకరు పెరుగు కావాలంటే మరొకరు పాలకోవా కావాలంటారు. ఇంతలోనే ఇంకొకరు వచ్చి పూతరేకులు రెడీయేనా అని అడుగుతారు. అడిగిన వాటన్నింటినీ ఆలస్యం చేయకుండా అందజేస్తారు ఆ ఇంటిలోని వాళ్లు. మూడు తరాలుగా అక్కడి ప్రజలకు రుచికరమైన పాలు, పాల పదార్థాలు అందిస్తోంది పాల గంగరాజు డైరీ. తెలుగువారి అభిమాన నటుడు అక్కినేని, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ కూడా గంగరాజు పాలకోవా తిన్నవారే. ఇలా మొదలైంది...: పశ్చిమగోదావరి జిల్లా పశివేదల గ్రామం (1950) లో నిమ్మలపూడి వీరన్న అనే రైతు ఇతర ప్రాంతాల నుంచి పాలు సేకరించి విక్రయించేవారు. కుమారుడు గంగరాజు తన 24వ ఏట వీరన్న ప్రారంభించిన పాల వ్యాపారాన్ని రాజమండ్రి దాకా తీసుకువచ్చారు. అక్కడ అప్పుడప్పుడే విస్తరిస్తున్న హోటళ్లకు... పశివేదల, ఉంగుటూరు పరిసర గ్రామాల నుంచి పాలను సేకరించి రాజమండ్రిలో విక్రయించేవారు. ఆయన పాలు తేకపోతే ఆ రోజు అక్కడి హోటళ్లు ఇంక బందే. ‘‘మా నాన్నగారు అలా పాలు సరఫరా చేస్తుండటంతో ఆయన పేరు పాల గంగరాజుగా మారిపోయింది’’ అంటారు ఆయన తదనంతరం ‘గంగరాజు పాల ఖ్యాతి’ ని దేశ విదేశాలకు వ్యాపింపచేసిన ఆయన కుమారుడు గోవిందు. పాల బండి వచ్చిందంటే...: విజయవాడ నుంచి రాజమండ్రికి ఉదయం పూట ప్యాసింజరు రైలు నడిచేది. ‘‘మా నాన్నగారు రోజూ ఇదే రైలులో పాలను బిందెలతో రాజమండ్రికి తెచ్చేవారు. పశ్చిమగోదావరి నుంచి పాలు అమ్మేందుకుగాను ఇదే రైల్లో మరికొందరు రాజమండ్రి వచ్చేవారు. అందరూ ఆ రైలును పాల బండి అని పిలిచేవారు. మా నాన్నగారు అందులో వుండేవారు. మిగులు పాలతో మొదలైంది వ్యాపారం: పాల సేకరణ పరిమాణం పెంచుతూ పోవడంతో పాలు మిగిలిపోయేవి. దీంతో రాజమండ్రిలో కూడా పాలు అమ్మేవారు గంగరాజు. అలా మా తాతగారు పశివేదలలో ఉండగానే నాన్నగారు రాజమండ్రి ఇన్నీసుపేటలోని త్యాగరాజనగర్‌కు మకాం మార్చారు. తాతగారు పంపిన పాలు హోటళ్లకు పోయగా మిగిలిన పాలను ఇంటి దగ్గర కొన్ని అమ్మి, మరికొన్ని పాలను పెరుగుగా మార్చి విక్రయించేవారు. ’’ అంటూ గతాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటారు గోవిందు. స్వచ్ఛతకు కేరాఫ్ అడ్రస్...: గంగరాజు డైరీలో... పాలు, పెరుగుతోపాటు పాలకోవాకు మంచి డిమాండ్ ఉంది. ఇవే కాకుండా నెయ్యి, వెన్న, పనీరు, పచ్చి కోవా, పూతరేకులు కూడా తయారు చేస్తారు. గంగరాజు పాలకోవా అమెరికా, లండన్, గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారికి సుపరిచితం. ఫోన్లో ఆర్డర్ ఇచ్చి ఆన్లైన్లో డబ్బులు పంపితే వాళ్లు సూచించిన వారికి డెలివరీ ఇస్తారు. ఇదో కుటుంబ పరిశ్రమ: మూడు తరాల ఆ కుటుంబ పరిశ్రమ నేడు గంగరాజు డైరీ అనే వ్యవస్థకు బలమైన పునాదిగా నిలిచింది. ‘‘లీటరు 30 పైసల రేటుతో ప్రారంభమైన మా పాల సేకరణ ఇప్పుడు 52 రూపాయల ధరలో కొనసాగుతోంది’’ అంటూ తమ వ్యాపారం ఎలా అభివృద్ధి చెందిందో చెబుతారు గోవిందు.వీరు తయారుచేసే పాలకోవా విదేశాలలో ఉన్నవారిని సైతం ఆకర్షిస్తోంది. అమ్మ చేతి పాలకోవా... ‘‘ఎన్ని పాలు విక్రయించినా ఇంకా పదిహేను లీటర్ల పాలు మిగిలిపోయేవి. మా అమ్మ సత్యవతి అలా మిగిలిన పాలతో కోవా చేసేవారు. ఇంటి ముందే వాటిని అమ్మేవారు. అమ్మ చేతి ఆ స్వచ్ఛమైన పాలకోవా గంగరాజు డైరీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ విదేశాల్లో ఉండే భారతీయులు కోవాను పోస్టు ద్వారా తెప్పించుకుంటున్నారంటే అది అమ్మ చేసిన కమ్మని పాలకోవా మహిమే!’’ - గోవిందు - దేవళ్ల సూర్యనారాయణమూర్తి, సాక్షి ప్రతినిధి, రాజమండ్రి ఫొటోలు: వీరభగవాన్ తెలగరెడ్డి -
అంతరిక్షంలో వినోదం!
అంతరిక్షయానం చేయాలని అందరికీ ఉంటుంది. కానీ, కొందరికే ఆ అవకాశం దక్కుతుంది. అయితే, అంతరిక్షయానం చేసిన అనుభూతిని ప్రేక్షకులకు కలిగించేలా జస్ట్ ఎల్లో మీడియా సంస్థ ‘చందమామలో అమృతం’ చిత్రాన్ని నిర్మించింది. చందమామ ఏంటి? అమృతం ఏంటి? అనుకుంటున్నారా? ఈ సినిమాలో ఇంకా బోల్డన్ని వింతలు చూపించబోతున్నారు. స్వీయదర్శకత్వంలో గుణ్ణం గంగరాజు నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ -‘‘అంతరిక్షం నేపథ్యంలో వినోద ప్రధానంగా సాగే చిత్రం ఇది. భారతదేశ చలన చిత్ర చరిత్రలో పూర్తిగా అంతరిక్ష నేపథ్యంలో సాగే చిత్రం ఇదే అవుతుంది. కథానుసారం సాగే 65 నిమిషాల నిడివి ఉన్న గ్రాఫిక్స్ ప్రేక్షకులను మంచి అనుభూతికి గురి చేస్తాయి. పిల్లలను, పెద్దలను అలరించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే చిత్రం ఇది’’ అని చెప్పారు. అవసరాల శ్రీనివాస్, శివన్నారాయణ, హరీష్, వాసు ఇంటూరి, ధన్య, సుచిత్ర, చంద్రమోహన్ తదితరులు ముఖ్య పాత్రలు చేసిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ, కెమెరా: రసూల్ ఎల్లోర్, పాటలు: అనంత శ్రీరామ్, ఎడిటింగ్: ధర్మేంద్ర.