గురువారం వరంగల్‌లో మహిళా కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్‌లో గురువారం జేఏసీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు హన్మకొండ బస్టాండ్ నుంచి అమరవీరుల స్తూపం వరకు నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మికులను అడ్డుకునే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మహిళా కండక్టర్లపై అనుచితంగా ప్రవర్తించారు. కాళోజీ కళాక్షేత్రం, బాల సముద్రం, ఏకశిల పార్కు వద్ద పోలీసులు ర్యాలీని నిలువరించి చెదరగొట్టే యత్నించగా కార్మికులు ప్రతిఘటించారు. ర్యాలీ నిర్వహించుకోవడానికి తమకు అనుమతి ఉందని ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను నిలదీ శారు. ఈ నేపథ్యంలో తోపులాట జరిగింది.
అంతా మగ పోలీసులే..
ర్యాలీలో పాల్గొన్న మహిళా కార్మికులను మగ పోలీసులు చెదరగొట్టే యత్నం చేయగా కొంత మంది మహిళా కార్మికులకు గాయాలయ్యాయి. ఉమ, రజిత, సుజాతలను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించడం ఏంటని నిలదీయగా.. లైట్ తీసుకోండని కాజీపే ట ఏసీపీ నర్సింగరావు చెప్పడంతో వారు కోపోద్రిక్తులయ్యారు. ఏసీపీ తీరుపై మహిళా సంఘాలు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, 11 మం ది ఆర్టీసీ కార్మికులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరో 26 మందిని ముందస్తుగా అరెస్టు చేసి, సొంత పూచికత్తుపై విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment