మంత్రి ఈటల రాజీనామా చేయాలి
చల్లూరు బాధితురాలికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్‌మాదిగ
కరీంనగర్ : వీణవంక మండలం చల్లూరు దళిత యువతిపై అత్యాచార ఘటనకు నైతిక బాధ్యత వహించి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్‌మాదిగ కోరారు. అంబేద్కర్ భవన్‌లో గురువారం నిర్వహించిన ఎంఎస్‌ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం విలేకరులతో మాట్లారు. నిందితులను రక్షించేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. గ్యాంగ్‌రేప్ బాధితురాలికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. ఎంఎస్‌ఎఫ్ జిల్లా ఇన్‌చార్జి బొర్ర భిక్షపతి, నగర అధ్యక్షుడు గోష్కి అజయ్, జిల్లా అధ్యక్షుడు మాతంగి మహేశ్, నాయకులు అనిల్, ప్రశాంత్, అజయ్, బోయిని శశి, ప్రవీణ్, హరికృష్ణ, ఉదయ్, రాజేశ్, లావణ్య, లక్ష్మణ్, వర్మ తదితరులు పాల్గొన్నారు.