మేడ్చల్‌కు చేరిన ‘మిషన్ కాకతీయ’ బైక్‌యాత్ర | mission kakatiya bike tour at medchal | Sakshi
Sakshi News home page

మేడ్చల్‌కు చేరిన ‘మిషన్ కాకతీయ’ బైక్‌యాత్ర

Published Thu, Apr 30 2015 11:47 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

మేడ్చల్‌కు చేరిన ‘మిషన్ కాకతీయ’ బైక్‌యాత్ర - Sakshi

మేడ్చల్‌కు చేరిన ‘మిషన్ కాకతీయ’ బైక్‌యాత్ర

మేడ్చల్: ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంపై ప్రచారం నిర్వహించేందుకు ఓ తెలంగాణ వాది చేపట్టిన బైక్‌యాత్ర గురువారం మేడ్చల్‌కు చేరింది. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన ప్రైవేట్ లెక్చరర్ సత్యం ఏప్రిల్ 14న జగిత్యాలలో బైక్ యాత్రను ప్రారంభించారు. 17 రోజులుగా కరీంనగర్, మెదక్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించారు.

ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలపై ప్రజల్లో చైతన్యం కలిపించేందుకు బైక్ యాత్రను చేపట్టినట్లు ఈ సందర్భంగా సత్యం తెలిపారు. అన్ని జిల్లాల్లో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు. మేడ్చల్ నుంచి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో బైక్ యాత్ర నిర్వహించి ముగిస్తానని సత్యం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement