మురికివాడలు శుభ్రంగా లేకపోతే చర్యలు: తీగల | MLA Teegala krishnareddy warn officers | Sakshi
Sakshi News home page

మురికివాడలు శుభ్రంగా లేకపోతే చర్యలు: తీగల

Published Sun, May 17 2015 6:42 PM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM

మురికివాడలు శుభ్రంగా లేకపోతే చర్యలు: తీగల

మురికివాడలు శుభ్రంగా లేకపోతే చర్యలు: తీగల

మలక్‌పేట (హైదరాబాద్): సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం పనికిరాదని, అధికారులు తమ తీరును మార్చుకోవాలని ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. సరూర్‌నగర్ డివిజన్ భగత్‌సింగ్ నగర్‌లో ఆదివారం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కోవా లక్ష్మీ ఇందిరాహిల్స్, పోలీస్‌క్వార్టర్స్, భగత్‌సింగ్‌నగర్ ప్రాంతాలలో పర్యటించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే, రోడ్లపై చెత్తకుప్పలు, డిబ్రీస్, పాడైన డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌ను గమనించిన ఎమ్మెల్యే తీగల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి భగత్‌సింగ్‌నగర్‌లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలిస్తామని తెలిపారు. 20 తేదిలోగా మురికివాడలు పరిశుభ్రంగా లేకపోతే అధికారులపై చర్యలు తప్పవన్నారు.

Advertisement

పోల్

Advertisement