సాక్షి, జగిత్యాల: కుట్ర పూరితంగానే ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెబుతున్నారని సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా శనివారం తన ఇంటి నుంచి ఆర్టీసీ డిపో వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ. .రాజ్యాంగ బద్ధంగా ప్రమాణం చేసిన సీఎం కేసీఆర్ అసలు రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తున్నారా అని ప్రశ్నించారు. సకల జనుల సమ్మెతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాజ్యం.. హింసాత్మకంగా మారుతుందన్నారు. ఆర్టీసీ ఆస్తులను 50 వేల కోట్లు తక్కువ చూపిస్తున్నారని.. ప్రైవేటు పెట్టుబడిదారులతో కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని జీవన్‌రెడ్డి ఆరోపించారు.
ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు
కొత్త హైర్ బస్సులను కొనుగోలు చేయడానికి 90 శాతం అప్పులు ఇవ్వడానికి ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆర్టీసీలో పదవి విరమణతో ఏర్పడిన ఖాళీ పోస్టులే ఆరువేల వరకూ ఉన్నాయని.. ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి 2లక్షల 50 వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు తొలగిపోవాలంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే ఏకైక మార్గం అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment