సాక్షి, హైదరాబాద్: సమగ్ర ఇంటింటి సర్వే వివరాలతో ఇప్పటివరకు తెలంగాణ జిల్లాల్లో కంప్యూటరీకరణ చేసిన దాంట్లో 54 లక్షల మందికి ఆధార్‌కార్డు లేదని తేలింది. దాదాపు 1.05 కోటి కుటుంబాల్లో ఇప్పటి వరకు 77.79 లక్షల కుటుంబాలకు సంబంధించి మొత్తం 2.61 కోట్ల మంది సమాచారాన్ని కంప్యూటర్లలో భద్రపరిచారు. అయితే, ఇందులో 2.07 కోట్ల మందికి ఆధార్‌కార్డులు ఉన్నట్టు తేలింది. ప్రతీ సంక్షేమ కార్యక్రమానికి ఆధార్‌కార్డును తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్‌కార్డులు లేని వారికి గ్రామాల్లో కార్డులు ఇప్పించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఆధార్‌కార్డు లేదన్న కారణంతో ఇప్పటికే ఐదారు లక్షల పెన్షన్లను ప్రభుత్వం నిలిపేసిన విషయం విదితమే. నాలుగైదు రోజుల్లో కంప్యూటరీకరణ పూర్తయ్యేనాటికి ఆధార్‌కార్డులు లేని వారి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారవర్గాలు వివరించాయి.