
నిరంజన్‌రెడ్డి,మంత్రి కేటీఆర్‌తో చైర్మన్ రమేష్‌గౌడ్, అన్ని పార్టీల కౌన్సిలర్లు
వనపర్తిటౌన్ : తన వద్దకు వచ్చిన ప్రతి ఫైల్ ను క్లియర్ చేస్తున్నట్లు పుర కమిషనర్ వెంకటయ్య తెలిపారు. పుర అధికారులే తాను రావట్లేదని, తన దృష్టికి తేకుండా తనను బ్లేమ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశా రు. బుధవారం పుర సర్వసభ్య సమావేశం చైర్మన్ రమేష్‌గౌడ్ అధ్యక్షతన జరిగింది. జోగుళాంబ గద్వాల జిల్లాకు వెళ్తున్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు గంటలోనే పుర సమావేశం ముగించేశారు. ఈ సందర్భంగా సభలో ప్రస్తావనకు వచ్చిన ఇద్దరూ అథికారులు దరఖాస్తు విషయంలో పొరపాట్లు దొర్లిన శ్రీనివాసులు, శర్మకు, శానిటేషన్ ట్రాక్టర్‌పై తప్పుడు సమాచారం ఇచ్చిన శానిటేషన్ సంబంధిత అధికారికి మెమో ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక నుంచి పురంలో ఒక పొరపాటు జరగనివ్వని, ఎలాంటి ఇబ్బందులున్నా నేరుగా తన దృష్టికి తేవాలని సభ్యులను కోరారు. అధికార సభ్యుడు పాకనాటి కృష్ణ, కాంగ్రెస్ ప్లోర్ లీడర్ భువనేశ్వరిలు చెత్త ట్రాక్టర్ రోజు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అధికార సభ్యులు ఇం దిరమ్మ, రమేష్‌నాయక్,బీజేపీ ఫ్లోర్ లీడర్ జ్యోతి మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల దరఖాస్తులు ఎందుకు తీసుకోవడం లేదని, కొత్త ఫించన్‌లు ఎందుకు ఆన్‌లైన్‌లో ఎన్ రోల్ చేయడం లేదని నిలదీయడంతో ఇక నుంచి ప్రక్రియ కొనసాగించనున్నట్లు అధికారులు వివరణ ఇచ్చారు.విద్యుత్ దిమ్మెలను కూల్చే వ్యక్తులపై విద్యుత్‌శాఖ చర్య లు తీసుకునేలా మునిసిపాలిటి విద్యుత్ అ« దికారులకు లేఖ రాయాలని టీఆర్‌ఎస్ స భ్యుడు సతీష్‌యాదవ్ సూచించారు. కాం గ్రెస్ సభ్యుడు చీర్ల విజయ్‌చందర్, అధికార సభ్యుడు వెంకటేష్‌లు మాట్లాడుతూ సిటిజ న్ చార్టర్ ప్రకారం సేవలు అందడం లేదని, ముటేషన్ దరఖాస్తులను పెండింగ్‌లోనే ఉంచుతున్నారని మండిపడటంతో వైస్ చైర్మన్ కృష్ణ మద్దతు ప్రకటించగా, కమిషనర్ నిబంధనలు అమలు చేస్తామన్నారు.
పురపాలక మంత్రిని కలసిన కౌన్సిలర్లు
వనపర్తి : పర్యటనకు వచ్చాక అభివృద్ధి పనులకు నిధులు ప్రకటించనున్నట్లు పురపాలక మంత్రి కేటీఆర్ వెల్లడించారు. బుధవారం అడ్డాకులలోని ఎంపీ జితేందర్‌రెడ్డి అతిథి గృహంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి పుర చైర్మన్ రమేష్‌గౌడ్ నేతృత్వంలోని ఆల్ పార్టీ కౌన్సిల్ బృందం మంత్రిని కలి«సి అభ్యర్థించారు. త్వరలో వనపర్తికి వస్తానని మంత్రి పేర్కొన్నారు. నిధులు ప్రకటిస్తానని మంత్రి పేర్కొన్నారని చైర్మన్ రమేష్‌గౌడ్ స్పష్టం చేశారు. మంత్రి పర్యాటన ఖరారైతే ఆధునిక హంగులతో నిర్మించే కూరగాయాల మార్కెట్లు, వైకుంఠధామం ప్రారంభం చేయిస్తామని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సభ్యులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment