సింహవాహన సేవలో నారసింహుడు | Nara simhudu gets at Simhavahana service at Yadigiricutta | Sakshi
Sakshi News home page

సింహవాహన సేవలో నారసింహుడు

Published Thu, Feb 26 2015 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM

Nara simhudu gets at Simhavahana service at Yadigiricutta

నల్లగొండ (యాదగిరికొండ) : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు బుధవారం ఉదయం గోవర్ధనగిరిధారి అలంకారం, రాత్రి సింహవాహన సేవలో దర్శనమిచ్చారు. ఉదయం స్వామి, అమ్మవార్లను పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి గోవర్ధనగిరిధారి అలంకారంలో ఆలయ తిరువీధులలో ఊరేగించారు. అర్చకులు, రుత్విక్కులు, వేద పండితులు వేద పారాయణాలు పఠిస్తూ ఊరేగింపుగా బయలుదేరారు. రాత్రి స్వామివారు సింహవాహన సేవలో తిరుమాడ వీధుల్లో ఊరేగారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement