ముగిసిన జాతీయ స్థాయి సదస్సు | national level convention completed | Sakshi
Sakshi News home page

ముగిసిన జాతీయ స్థాయి సదస్సు

Published Sat, Aug 23 2014 11:37 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

ముగిసిన జాతీయ స్థాయి సదస్సు - Sakshi

ముగిసిన జాతీయ స్థాయి సదస్సు

శామీర్‌పేట్ : మండలంలోని తుర్కపల్లిలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ అడ్వాన్స్‌డ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్’ జాతీయ స్థాయి సదస్సు శనివారం సాయంత్రం ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ఉమా మంగేశ్వర్‌రావు హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదుతోపాటు ప్రశంసా పత్రాలను అందజేశారు.
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కళాశాలలు సెమినార్‌లు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను ఇతరులకు పంచే అవకాశం కలుగుతుందన్నారు. సెమినార్‌లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లోని స్టేజి ఫియర్ తొలగించే వీలుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని నిర్వహించి  ఆదర్శంగా నిలవాలన్నారు.
 
కార్యక్రమంలో సెమినార్ ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ డా.ఎస్‌డీ షణ్ముగ కుమార్, కన్వీనర్ ఫల్గుణ, ప్రిన్సిపాల్ రమణమూర్తి, కమిటీ సభ్యులు నాగస్వామి వెంకటేశ్, డా. రామ్మోహన్‌గుప్తా, డా. కన్నన్ వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement