నిర్లక్ష్యపు ‘చూపు’ వల్లే.. | Neglects Sarojini hospital : CAG | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యపు ‘చూపు’ వల్లే..

Published Tue, Mar 28 2017 4:01 AM | Last Updated on Sat, Sep 22 2018 8:48 PM

నిర్లక్ష్యపు ‘చూపు’ వల్లే.. - Sakshi

నిర్లక్ష్యపు ‘చూపు’ వల్లే..

సరోజినీ ఆసుపత్రిలో పలువురికి కంటి చూపు పోయింది..
నాణ్యత పరీక్షలు చేయించకపోవడం వల్లే ఘటన
టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి ‘కాగ్‌’ అక్షింతలు
మందులు, పరికరాల నిధులు ఖర్చు చేయలేదని స్పష్టీకరణ  


సాక్షి, హైదరాబాద్‌: గతేడాది సరోజినీ ఆసుపత్రిలో పలువురికి కంటి చూపు పోవడం వెనుక నిర్లక్ష్యమే కారణమని కాగ్‌ తేల్చింది. ఆపరేషన్ల సమయంలో కలుషిత రింగర్‌ లాక్టేట్‌ ద్రావణాన్ని ఇవ్వటం వల్ల ఇన్‌ఫెక్షన్‌ సోకిందని, దీంతో 13 మంది కంటి చూపు కోల్పోయారని స్పష్టం చేసింది. ఆరుగురికి కంటి చూపు తిరిగి వచ్చినా.. మిగిలిన రోగులు ‘చూపు’ కోసం ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని కాగ్‌ తెలిపింది. ఇలాంటి ఘటనలు ఇంకా జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది.

కాగ్‌ ఇంకా ఏం చెప్పిందంటే..
తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) గతేడాది మార్చిలో 24,456 సీసాల (మూడు బ్యాచ్‌ల్లో) ‘కాంపౌండ్‌ సోడియం లాక్టేట్‌ ఇంజెక్షన్‌ ఐపీ 500 ఎంఎల్‌’ను ఒక సంస్థ నుంచి కొనుగోలు చేసింది. వీటిని హైదరాబాద్‌ కేంద్రీయ ఔషధ సంస్థ (సీఎంఎస్‌) ద్వారా సరోజినీ కంటి ఆసుపత్రి సహా వివిధ ఆసుపత్రులకు పంపిణీ చేసింది. అయితే సరఫరా సంస్థ ఇచ్చిన అంతర్గత నివేదిక తప్ప వీటికి ప్రయోగశాలలో నాణ్యత పరీక్షలు చేయించలేదు. సరోజినీ కంటి ఆసుపత్రిలో ఈ మందును గతేడాది జూన్‌ 30వ తేదీన జరిగిన శస్త్రచికిత్సల సమయంలో 13 మంది రోగులకు వినియోగించారు. ఆ మరుసటి రోజున ఈ రోగులు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు. ఆరుగురికి కంటి చూపు తిరిగి వచ్చినా మిగిలిన రోగులు కంటిచూపు తిరిగి పొందడం కోసం ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఆపరేషన్ల సమయంలో కలుషిత రింగర్‌ లాక్టేట్‌ ద్రావణాన్ని ఇవ్వటమేనని ఇన్‌ఫెక్షన్‌కు కారణం.

నిధుల విడుదల అంతంతే..
మందులు, ఔషధాలు, పరికరాల కొనుగోలుకు బడ్జెట్లో కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో విడుదల చేయలేదు. 2014–16 సంవత్సరాల్లో వచ్చిన నిధులను టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ పూర్తిగా వినియోగించలేదు. 2014–15లో దాదాపు 40 శాతం నిధులు ఖర్చు చేయలేదు. మందులు, ఔషధాలు, సర్జికల్‌ పరికరాలను కొనేముందు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల అవసరాలను పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఆయా ఆసుపత్రులు స్థానిక దుకాణాల నుంచి అధిక ధరలకు తెచ్చుకున్నాయి. రాష్ట్రంలో 635 రకాల నిత్యావసర మందులకుగాను 237 రకాల మందుల కొనుగోలుకు ఏర్పాటులేవీ చేయలేదు.

 2014–16 మధ్య ఇచ్చిన 197 పర్చేజ్‌ ఆర్డర్లకు సరఫరాదారు సంస్థలు సరఫరా చేయలేదు. దీంతో మందులు లభించక అనేకమంది రోగులు ఇబ్బందులకు గురయ్యారు. ఆదిలాబాద్, హైదరాబాద్, వరంగల్‌లోని కేంద్రీయ ఔషధ సంస్థ (సీఎంఎస్‌) కేంద్రాలు 80 శాతం కన్నా తక్కువ కాలపరిమితి కలిగిన మందులను తీసుకున్నాయి. ఆదిలాబాద్, హైదరాబాద్‌లలో తీసుకున్న మందుల్లో క్రియాశీలక పదార్థాలు నిర్దేశిత స్థాయికన్నా తక్కువగా ఉన్నాయి. ఐదు ఆసుపత్రుల్లో రూ.8.30 కోట్ల విలువైన మందులు, సర్జికల్‌ పరికరాలను పెద్దమొత్తంలో స్థానిక దుకాణాల నుంచి కొనుగోలు చేశారు. అవి సీఎంఎస్‌ కేంద్రాల్లో ఉన్నాయా లేదా కూడా ఆసుపత్రి వర్గాలు నిర్ధారించుకోలేదు. అలాగని కొనుగోళ్లలో పారదర్శకత కోసం రేటు కాంట్రాక్టు విధానాన్నీ అనుసరించలేదు.

రూ.6.50 లక్షల వెంటిలేటర్‌.. రూ.11 లక్షలకు కొనుగోలు
ఆదిలాబాద్, హైదరాబాద్, వరం గల్‌ సీఎంఎస్‌ కేంద్రాల్లో కొన్ని మందులు నిల్వ లేకపోవడంతో ఆసుపత్రుల్లో కొరత ఏర్పడింది. కొన్ని మందులను నిర్ణీత ఉ ష్ణోగ్రత వద్ద పదిలపరచవలసి ఉండగా ఆదిలాబాద్, వరంగల్‌ సీఎంఎస్‌ కేంద్రా ల్లో భద్రపరిచేందుకు శీతలీకరణ ఏర్పా ట్లు లేవు. గాంధీ ఆసుపత్రికి 2015లో 50 వెంటిలేటర్లు కొనుగోలు చేశారు. మార్కె ట్లో రూ.6.50 లక్షలున్న వెంటిలేటర్‌ను రూ.11 లక్షలతో కొనుగోలు చేశారు. ఇం దులో ప్రభుత్వ సొమ్ము పెద్ద ఎత్తున నష్ట పోయి ఉండొచ్చు.

ఇలాంటివి ఎన్ని జరిగాయో..!
సరోజినీ ఆస్పత్రి ఘటన ఓ ఉదాహరణ మాత్ర మే. ఇంకా అనేకం జరిగి ఉండొచ్చు. 2014–16 మధ్య టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ రూ.237 కోట్ల విలువైన మందులు, సర్జికల్‌ పరికరాలు కొనుగోలు చేసింది. అవన్నీ నిబంధనల ప్రకా రం నాణ్యత పరిశీలన నివేదికలు అందిన తర్వాతే పంపిణీ చేశారన్న నమ్మకం లేదు. ఆసుపత్రుల్లో రోగులకు భరోసా కూడా లేదు. నాణ్యత విశ్లేషణ నివేదికలు అందిన తర్వాతే మం దులను పంపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement