మెదక్ : మెదక్ జిల్లా సిద్ధిపేటలోని కోమటిచెరువులో దారుణం చోటు చేసుకుంది. కోమటిచెరువు పక్కనే ఉన్న శ్మశానవాటికలో అప్పుడు పుట్టిన శిశువును శనివారం తెల్లవారుజామున ఆగంతకులు వదిలి వెళ్లారు. శ్మశానంలో శిశువు ఏడుపు వినిపించడంలో స్థానికలు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం వారు శిశువును చేరదిసి... 108కి సమాచారం అందించారు. 108 వాహనంలో ఆ శిశువును ఆస్పత్రికి తరలించారు. ఆ శిశువు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
శ్మశానంలో శిశువు దొరికిన విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఈ అంశంపై ఐసీడీఎస్ అధికారులతో చర్చిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు బైకుపై వచ్చి శిశువును శ్మశానంలో వదిలి వెళ్లారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.