తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
బషీరాబాద్: పాఠశాలకు వెళ్లమని తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ ఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. కాశింపూర్‌కు చెందిన ముద్ది రాములు, సావిత్రమ్మ దంపతుల కుమారులు బీరప్ప, మల్లేశ్ అలియాస్ మహేష్(13) గొట్టిగకుర్దు పాఠశాలలో పది, తొమ్మిదో తరగతులు చదువుతున్నారు. ఆదివారం గ్రామంలో ఆడుకుంటుండగా మహేష్ కాలికి గాయమైం ది. దీంతో సోమవారం అన్నదమ్ములు ఇంటి వద్దే ఉన్నారు. ఉదయం 9 గంటలకు రాములు విషయం గమనించి స్కూల్‌కు ఎందుకు వెళ్లలేదని మందలించాడు. అనంతరం బీరప్ప పాఠశాలకు వెళ్లిపోయాడు. మహేష్ దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.