‘బంగారు తెలంగాణ’కు ఎన్నారైలు కీలకం | NRIs to play key role for bangaru telangana, says Kalvakuntla kavitha | Sakshi
Sakshi News home page

‘బంగారు తెలంగాణ’కు ఎన్నారైలు కీలకం

Published Tue, Nov 11 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM

‘బంగారు తెలంగాణ’కు ఎన్నారైలు కీలకం

‘బంగారు తెలంగాణ’కు ఎన్నారైలు కీలకం

రాయికల్: బంగారు తెలంగాణ నిర్మాణంలో ఎన్నారైల పాత్ర చాలా కీలకమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. లండన్‌లో సోమవారం జరిగిన టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ వార్షికోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. బంగారు తెలంగాణ సాధన దిశగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించారు.
 
  హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంత వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వంద రోజుల పాలనపై టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ రూపొందించిన పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ ఉద్యమకర్త ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళులర్పించినట్లు టీఆర్‌ఎస్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు కూర్మాచలం అనిల్ సోమవారం ఈ మెయిల్ ద్వారా ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement