రామగుండం(కరీంనగర్): నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఎన్టీపీసీ డైరెక్టర్(ఆపరేషన్స్) కేకే శర్మ గురువారం సందర్శించారు. కరీంనగర్ జిల్లా రామగుండంలోని జ్యోతినగర్‌లో ఉన్న ఈ ప్లాంట్ నుంచి ప్రజల అవసరాలను తీర్చేందుకు 10 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. సందర్శన అనంతరం శర్మ అధికారులతో ప్లాంట్ పనితీరుపై చర్చించారు. అంతే కాకుండా, గురువారం ఎన్టీపీసీ దక్షిణ ప్రాంత జనరల్ మేనేజర్లు, ఏజీఎమ్‌ల సమావేశంలో ఆయన పాల్గొంటారని సమాచారం.