త్వరలో13వ ఆర్థిక సంఘం బకాయిలు విడుదల | pending funds of 13th financial comission will released soon | Sakshi
Sakshi News home page

త్వరలో13వ ఆర్థిక సంఘం బకాయిలు విడుదల

Published Sat, Feb 28 2015 4:14 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM

త్వరలో13వ ఆర్థిక సంఘం బకాయిలు విడుదల

త్వరలో13వ ఆర్థిక సంఘం బకాయిలు విడుదల

- పురపాలికలకు రావాల్సింది రూ.628.84 కోట్లు
- రూ.107 కోట్లు విడుదలకు కేంద్రం ఆమోదం
- వారంలో మరో రూ.150 కోట్లు విడుదల
- పురపాలక శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ హామీ
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లో స్థానిక సంస్థలకు రావాల్సిన ‘13వ ఆర్థిక సంఘం’ నిధుల బకాయిలు ఎట్టకేలకు విడుదల కానున్నాయి. భారీగా పెరుకుపోయిన బకాయిలను విడుదల చేసేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రంలోని 68 పురపాలక సంఘాలకు 2010-15 మధ్య కాలంలో  కేంద్ర కేటాయింపుల మేరకు మొత్తం రూ.894.79 కోట్ల నిధులు రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం రూ.319.23 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. పురపాలక ఎన్నికలను సకాలంలో నిర్వహించకపోవడంతో 2011-12 ఆర్థిక సంవత్సరం నుంచే 13వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం నిలిపివేసింది.

పురపాలక ఎన్నికల తర్వాత కేంద్రం గతేడాది రెండు విడతల్లో రూ.126.72 కోట్లను విడుదల చేసింది. 2013-14, 2014-15 సంవత్సరాలకు సంబంధించి ఇంకా 628.84 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రెండు మూడు రోజుల్లో పురపాలికలకు మరో రూ.107 కోట్లను విడుదల చేసేందుకు కేంద్రం ఆమోదించింది. సోమవారం ఈ నిధులు రాష్ట్రానికి చేరనున్నాయి. మరో వారం రోజుల్లో ఇంకో రూ.150 కోట్లను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. పురపాలక శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో సంప్రదింపులు జరపగా.. ఈ మేరకు హామీ లభించింది. ఈ ఏడాది మార్చితో 13వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగిసిపోతుండడంతో ఆ లోగా బకాయిలను రాబట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచింది.
 
పురపాలికలకు 13వ ఆర్థిక సంఘం కేటాయింపులు, విడుదలైన నిధులు, బకాయిల వివరాలు ఇలా ఉన్నాయి..
మొత్తం కేటాయింపులు: రూ. 894.79 కోట్లు
మంజూరైన నిధుల: రూ. 319.23 కోట్లు
రావాల్సిన నిధులు: రూ. 628.84 కోట్లు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement