released soon
-
నిశ్చితార్థం పూర్తి
ప్రవీర్ శెట్టి, ఐశ్వర్యా గౌడ జంటగా రాజు బొనగాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంగేజ్మెంట్’. రోడియమ్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో జయరామ్ దేవ సముద్ర నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. జయరామ్ దేవ సముద్ర మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘ఎంగేజ్మెంట్’. సినిమా ఔట్పుట్ బాగా వచ్చింది. రాజు బొనగాని అద్భుతంగా తీశాడు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒడియా భాషల్లో రిలీజ్ చేస్తాం. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దిలీప్ బండారి, రజత్ గోష్, కెమెరా: వెంకట్ మన్నం, సహనిర్మాతలు: లక్ష్మీకాంత్ ఎన్ఆర్, నారాయణ స్వామి .ఎస్. -
ఏమవుతుంది?
ప్రపంచ మానవాళికి 2064 సంవత్సరంలో ఏం అవుతుంది? ఏం మార్పులు సంభవిస్తాయి? అనే అంశంతో రూపొందిన చిత్రం ‘కలియుగం’. శ్రద్ధా శ్రీనాథ్, కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రమోద్ సుందర్ దర్శకత్వంలో కేఎస్ రామకృష్ణ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో రిలీజ్ కానుంది. ‘‘హారర్ థ్రిల్లర్‌గా ‘కలియుగం’ రూపొందింది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డాన్ విన్సెంట్, కెమెరా: కె. రామ్‌చరణ్. -
శశికళ విడుదల ఖాయం
సాక్షి, చెన్నై: జనవరి 27న జైలు జీవితం నుంచి చిన్నమ్మ శశికళ బయటకు రావడం ఖాయం అని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఆమెకు బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశికళ శిక్షా కాలం జనవరిలో ముగియనున్న విషయం తెలిసిందే. ఆమె ముందుగానే విడుదల అవుతారన్న ప్రచారం సాగినా, అందుకు తగ్గ పరిస్థితులు కనిపించలేదు. తన ముందస్తు విడుదల విషయంగా శశికళ చేసుకున్న విజ్ఞప్తిని కర్ణాటక జైళ్లశాఖ వర్గాలు పరిశీలనలో ఉంచాయి. ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ ముందుస్తుగాకాదు అని, శిక్షాకాలం ముగియగానే జనవరి 27న విడుదల కావడం తథ్యమని, ఇందులో మార్పు ఉండదని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు తాజాగా ధీమా వ్యక్తం చేసే పనిలో పడ్డాయి. చదవండి: నో పార్టీ.. ఓన్లీ సేవ మంగళవారం చిన్నమ్మ రాక గురించి చెన్నైలోని కార్యాలయంలో ఆ కళగం వర్గాలు సమావేశం కావడం, ఆహ్వాన ఏర్పాట్లపై దృష్టి పెట్టడం గమనించదగ్గ విషయం. జనవరి 27న చిన్నమ్మ జైలు నుంచి బయటకు రావడం ఖాయమని, నేరుగా మెరీనా తీరానికి వెళ్లి అమ్మ జయలలిత సమాధి వద్ద శపథం చేయనున్నారని, ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్తారని ఆ కళగం నేత ఒకరు పేర్కొన్నారు. చిన్నమ్మకు బ్రహ్మరథం పట్టే రీతిలో 65 చోట్ల ఆహ్వాన ఏర్పాట్లకు నిర్ణయించామని, ఇందుకు తగ్గ ఏర్పాట్లపై దృష్టి పెట్టనున్నామని తెలిపారు. మరో 28 రోజుల్లో చిన్నమ్మ బయటకు వస్తారని, ఇది జరిగి తీరుతుందని ఆ నేత ధీమా వ్యక్తంచేశారు. -
దీపావళి ‘సినిమా’ పటాసులు
దీపావళికి ప్రతీ ఏడాది థియేటర్స్‌లోకి మతాబుల్లా సినిమాలు వస్తుంటాయి. చిచ్చుబుడ్డుల్లా వెలుగులు విరజిమ్ముతాయి. అయితే ఈ ఏడాది కోవిడ్ వల్ల పండగలకు కొత్త విడుదలలు ఉండట్లేదు. ఔట్లన్నీ ఓటీటీల్లో పేలుతున్నాయి. తమిళంలో ఈ దీపావళికి మూడు పెద్ద సినిమాలు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. ఆ టపాసుల విశేషాలు. ఆశయం గొప్పదైతే... నీ ఆశయం గొప్పదైతే ఆకాశం కూడా అందుకోగలవు అని తన తాజా చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా!’ (తమిళంలో సూరరై పోట్రు) ద్వారా చెబుతున్నారు సూర్య. తక్కువ ఖరీదులోనే పేదవాడు కూడా విమానయానం చేయొచ్చు అని కల కని నిజం చేసుకున్న పైలెట్ పాత్రలో సూర్య నటించిన చిత్రం ఇది. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమాను సూర్యనే స్వయంగా నిర్మించారు. తమిళంలో నేరుగా ఓటీటీలో విడుదలవుతున్న భారీ చిత్రమిదే. నవంబర్ 12 నుంచి అమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. అమ్మవారే దిగి వస్తే? మతం అనేది అందర్నీ సరైన మార్గంలో నడిపించడానికి ఉన్నది. ఈ నమ్మకాన్ని తప్పు దోవలో పట్టించాలనే ప్రయత్నం చేసే కొందర్ని సరైన మార్గంలో పెట్టడానికి ఆ అమ్మవారే దిగి వస్తే? ఈ కథాంశంతో నయనతార ప్రధాన పాత్రలో ‘మూకుత్తి అమ్మన్’ తెరకెక్కింది. తెలుగులో ‘అమ్మోరు తల్లిగా’ విడుదల కానుంది. ఆర్జే బాలాజీ, యన్జే శ్రవణన్ దర్శకత్వం వహించారు. ఇందులో అమ్మవారి పాత్రలో నయనతార కనిపిస్తారు. నవంబర్ 14 నుంచి ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. భూమి రైతు ఆత్మహత్యలు, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘భూమి’. ‘జయం’ రవి హీరోగా నటించారు. ఇది ఆయన కెరీర్లో 25వ సినిమా. ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటించారు. లక్ష్మణ్ దర్శకత్వం వహించారు. దీపావళి రోజు సాయత్రం సన్‌టీవీలో ప్రసారం కానుంది. అలాగే సన్ నెక్ట్స్‌లోనూ ఈ సినిమా ప్రసారం కానుంది. -
త్వరలో13వ ఆర్థిక సంఘం బకాయిలు విడుదల
- పురపాలికలకు రావాల్సింది రూ.628.84 కోట్లు - రూ.107 కోట్లు విడుదలకు కేంద్రం ఆమోదం - వారంలో మరో రూ.150 కోట్లు విడుదల - పురపాలక శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ హామీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లో స్థానిక సంస్థలకు రావాల్సిన ‘13వ ఆర్థిక సంఘం’ నిధుల బకాయిలు ఎట్టకేలకు విడుదల కానున్నాయి. భారీగా పెరుకుపోయిన బకాయిలను విడుదల చేసేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ సహా రాష్ట్రంలోని 68 పురపాలక సంఘాలకు 2010-15 మధ్య కాలంలో కేంద్ర కేటాయింపుల మేరకు మొత్తం రూ.894.79 కోట్ల నిధులు రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం రూ.319.23 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. పురపాలక ఎన్నికలను సకాలంలో నిర్వహించకపోవడంతో 2011-12 ఆర్థిక సంవత్సరం నుంచే 13వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం నిలిపివేసింది. పురపాలక ఎన్నికల తర్వాత కేంద్రం గతేడాది రెండు విడతల్లో రూ.126.72 కోట్లను విడుదల చేసింది. 2013-14, 2014-15 సంవత్సరాలకు సంబంధించి ఇంకా 628.84 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రెండు మూడు రోజుల్లో పురపాలికలకు మరో రూ.107 కోట్లను విడుదల చేసేందుకు కేంద్రం ఆమోదించింది. సోమవారం ఈ నిధులు రాష్ట్రానికి చేరనున్నాయి. మరో వారం రోజుల్లో ఇంకో రూ.150 కోట్లను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. పురపాలక శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో సంప్రదింపులు జరపగా.. ఈ మేరకు హామీ లభించింది. ఈ ఏడాది మార్చితో 13వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగిసిపోతుండడంతో ఆ లోగా బకాయిలను రాబట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచింది. పురపాలికలకు 13వ ఆర్థిక సంఘం కేటాయింపులు, విడుదలైన నిధులు, బకాయిల వివరాలు ఇలా ఉన్నాయి.. మొత్తం కేటాయింపులు: రూ. 894.79 కోట్లు మంజూరైన నిధుల: రూ. 319.23 కోట్లు రావాల్సిన నిధులు: రూ. 628.84 కోట్లు