
ఎంపీ కవిత వ్యాఖ్యలపై ప్రైవేటు ఫిర్యాదు
హైదరాబాద్: స్వాతంత్య్రం వచ్చాక కాశ్మీర్, తెలంగాణను బలవంతంగా భారత్ లో విలీనం చేశారని, కాశ్మీర్‌లోని కొన్ని భాగాలు ఇండియా భూభాగంలోవి కావని టీఆర్‌ఎస్ ఎంపీ కె.కవిత చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోరుతూ నాంపల్లి కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలైంది. బీజేపీ లీగల్ సెల్ హైదరాబాద్ విభాగం కన్వీనర్ కరుణాసాగర్ ఫిర్యాదును పరిశీలించిన ఏడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నిజాముద్దీన్ విచారణను ఆగస్టు 1కి వాయిదా వేశారు.